Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

Astro Tips: మసాలా దినుసులలో ఏకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్’ అని ఏలకులకు పేరు. అయితే, ఈ యాలకులను వంటలతో పాటు..

Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!
Cardamom
Follow us

|

Updated on: Mar 30, 2022 | 6:15 AM

Astro Tips: మసాలా దినుసులలో ఏకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్’ అని ఏలకులకు పేరు. అయితే, ఈ యాలకులను వంటలతో పాటు.. టీ లో, పచ్చిగా కూడా తింటారు. దీని సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే, యాలకులు లేకుండా ఆహారం గానీ, టీ గానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. యాలకులకు సంబంధించి మరో విశేషమేంటంటే.. యాలకులకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ యాలకులు దూరం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. యాలకులను జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినియోగిస్తే.. ఎంతటి దుర్భిక్ష పరిస్థితులైనా ఇట్టే పోతాయని విశ్వాసం. యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. జీవితంలో ఎదురయ్యే కాల సంబంధిత సమస్యలను సైతం తొలగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. యాలకులకు సంబంధించి కొన్ని ప్రభావవంతమైన జ్యోతిష్య నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థిక సమస్యల నివారణకు.. కష్టపడి, అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ.. ఆర్థికంగా చతికిలబడిపోతుంటారు కొందరు. ఏ విషయంలోనూ విజయం సాధించలేకపోతుంటారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు తొలగాలన్నా.. జేబులో డబ్బు పుష్కలంగా ఉండాలన్నా.. 5 పచ్చి యాలకులను తీసుకుని మీ పర్స్‌లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జేబుల్లో నిలిచి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

పేదరికం నుంచి బయటపడటానికి.. చాలా మంది పేదరికంలో మగ్గిపోతుంటారు. పేదరికం నుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ, అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒక నాణెంను నిస్సహాయ వ్యక్తికి విరాళంగా ఇవ్వాలి. అదే సమయంలో యాలకులను తినిపించాలి. ఈ పరిహారం ప్రభావవంతంగా ఉంటుందని, పేదరికం నుంచి బయటపడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఉద్యోగంలో పురోగతి.. ఒక్కోసారి ఏళ్ల తరబడి శ్రమించినా తమ ప్రతిభకు తగ్గట్టుగా ఫలితం ఉండదు. పదోన్నతి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం పచ్చటి గుడ్డ తీసుకుని అందులో 4 నుంచి 5 యాలకులు పెట్టాలి. ఈ మూటను దిండు కింద పెట్టుకోవాలి. ఉదయం లేవగానే.. మరొక వ్యక్తికి ఇవ్వాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.)

Also read:

Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!

PM Modi – CM Kcr: ప్రధాన మంత్రికి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఏం కోరారంటే..

Telangana Weather Alert: బాబోయ్ ఎండలు.. రాష్ట్రంలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు..!