AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!

Banks Holidays: ఆర్థిక సంవత్సరం 2022 - 2023 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అనేక పనులు ఉంటాయి.

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!
Bank Holiday
Shiva Prajapati
|

Updated on: Mar 30, 2022 | 6:00 AM

Share

Banks Holidays: ఆర్థిక సంవత్సరం 2022 – 2023 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అనేక పనులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కస్టమర్లు.. బ్యాంకుల సేలవులు, సేవలు తదితర అంశాలపై అప్‌డేట్స్‌ కోసం చూస్తుంటారు. అయితే, ఏప్రిల్ నెలలో దేశ వ్యాప్తంగా ఆయా బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెలలో జాతీయ పండుగలు లేకపోయినప్పటికీ.. వారాంతపు సెలవు, ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలు, పండుగల వలన సెలవులు ఉన్నాయి. వాస్తవానికి ఈ బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. సెంట్రల్ బ్యాంకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్, పబ్లిక్‌ బ్యాంకులకు సంబంధించి నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ సెలవులు మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీటిలో ఒకటి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవులు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఇచ్చే సెలవులు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్ ఉంటాయి.

ఏప్రిల్‌లో బ్యాంకులకు మొత్తం 15 సెలవులు ఇవ్వనున్నారు. వీటిలో 6 వారాంతపు సెలవులు ఉన్నాయి. కాగా, చాలా బ్యాంకులకు ఏప్రిల్ 1న సెలవు ఉంది. ఆ తరువాత గుడి పడ్వా / ఉగాది పండుగ/ చీరబా నేపథ్యంలో ఏప్రిల్ 2 న బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంతేకాకుండా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, సిరుల్, బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు కారణంగా ఏప్రిల్ 4, 5 తేదీలలో బ్యాంకులు పనిచేయవు.

ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, మహావీర జయంతి, బైసాఖీ, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, చెరోబా, బిజు పండుగ, గుడ్ ఫ్రైడే, బెంగాలీ నూతన సంవత్సర దినోత్సవం (నబాబర్ష), హిమాచల్ డే, విషు వంటి అనేక పండుగల కారణంగా ఏప్రిల్ 14 నుంచి 16 వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 16వ తేదీ మూడో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 21న గరియా పూజ, ఏప్రిల్ 29న షాబ్-ఇ-ఖదర్ / జుమాత్-ఉల్-విదా కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

వారాంతపు సెలవులో భాగంగా నాలుగు ఆదివారాలు (ఏప్రిల్ 3, 10, 17, 24) ఉంటాయి. రెండు శనివారం (ఏప్రిల్ 9, 23) సెలవులు కూడా ఉంటాయి. బ్యాంకులు సాధారణంగా నెలలో మొదటి, మూడవ శనివారాల్లో తెరిచి ఉంటాయి. చాలా బ్యాంకులు వారాంతపు రోజులు మినహా ఏప్రిల్ 1, 14, 15 తేదీలలో బంద్ ఉంటాయి. కస్టమర్‌లు ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీలు చేయాలనుకుంటే, బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉన్నట్లయితే ఏప్రిల్ నెలలో ఉన్న ఈ సెలవులను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం ఉత్తమం.