Orange: ఆ సమస్యలున్న వారికి దివ్యౌషధం నారింజ.. రోజూ జ్యూస్ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

ప్రతి ఒక్కరూ పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే నారింజ పండ్లను తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఆరెంజ్ పండ్లు.. రుచిగా ఉండడంతో పాటు అనేక పోషకాలు దాగున్నాయి.

Orange: ఆ సమస్యలున్న వారికి దివ్యౌషధం నారింజ.. రోజూ జ్యూస్ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
Orange
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2022 | 10:56 AM

ప్రతి ఒక్కరూ పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే నారింజ పండ్లను తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఆరెంజ్ పండ్లు.. రుచిగా ఉండడంతో పాటు అనేక పోషకాలు దాగున్నాయి. నారింజ, దాని రసం రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆరెంజ్ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇంకా అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ విటమిన్ సికి మంచి మూలం. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన జుట్టు, కంటి చూపుకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళలకు సంత్రపండ్లు సర్వరోగ నివారిణిగా చెబుతారు ఆరోగ్య నిపుణులు. నారింజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ సికి మంచి మూలం: విటమిన్ సి నారింజలో 70 శాతం వరకు ఉంటుంది. ఒక నారింజలో విటమిన్ సీ మన శరీరంలో రోజంతా సరఫరా చేయగలదు. విటమిన్-సి శరీరంలో ఐరన్ నిల్వ చేయడానికి, మెరుగైన రోగనిరోధక శక్తికి అవసరం.

పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది: నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేసి పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తే, అది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు, నారింజ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలకు దివ్యౌషధం: మన శరీరం DNA, ఇతర జన్యు పదార్థాలను తయారు చేయడానికి పని చేస్తుంది. దీనికి బి విటమిన్ ఫోలేట్ అవసరం. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో నారింజ తినమని వైద్యులు సలహా ఇవ్వడానికి కారణం ఇదే. నారింజను తినడం వల్ల పిల్లల మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది.

మెడిసిన్ కంటే ఎక్కువగా : ఒక నారింజలో 170 కంటే ఎక్కువ ఫైటోకెమికల్స్, 60 ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఇతర యాంటీఆక్సిడెంట్ ఫుడ్ లేదా మెడిసిన్ కంటే ఎక్కువ. ఆరెంజ్ క్యాన్సర్, కీళ్లనొప్పులు, మధుమేహం, అల్జీమర్స్ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు