Blood Cancer: ఈ 5 లక్షణాలు పిల్లలలో బ్లడ్ క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో పిల్లల్లో ఎక్కువగా లుకేమియా(బ్లడ్ క్యాన్సర్) కేసులు అనేకం బయటపడుతున్నాయి. ల్యుకేమియా అనేది..

దేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి . వృద్ధాప్యంలో మాత్రమే క్యాన్సర్ వస్తుందని ప్రజలందరూ అనుకుంటారు. కానీ పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పిల్లల్లో ఎక్కువగా లుకేమియా(బ్లడ్ క్యాన్సర్) కేసులు అనేకం బయటపడుతున్నాయి. ల్యుకేమియా అనేది ఎముక మజ్జతో సహా శరీరంలోని రక్తం-ఏర్పడే కణజాలాల క్యాన్సర్. ఈ వ్యాధి సోకినవారికి, ఎముక మజ్జలో తెల్ల రక్త కణాలు వేగంగా, అసాధారణంగా పెరుగుతాయి. ఈ క్యాన్సర్‌ను చికిత్సతో నయం చేయవచ్చునని.. ఫస్ట్ స్టేజిలోనే దీన్ని గుర్తిస్తే.. రోగికి లైఫ్ రిస్క్ ఉందని డాక్టర్లు అంటున్నారు.
రక్త కణాల మార్పిడి ద్వారా ఈ క్యాన్సర్‌ను సులభంగా నయం చేయవచ్చునన్నారు. కీమోథెరపీతో పాటు, రక్త కణాల మార్పిడి ఈ క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స అని క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ అనురాగ్ కుమార్ పేర్కోన్నారు. ఈ ప్రక్రియ తలసేమియా రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎముక మజ్జ మార్పిడిని ఏ వయస్సులోనైనా చేయవచ్చునని తెలిపారు. అధునాతన సాంకేతికతతో, ఎముక మజ్జ మార్పిడి(బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) ప్రక్రియ 70-80 సంవత్సరాల వయస్సు గల రోగులలో కూడా సులభంగా చేయవచ్చు. ఇదిలా ఉంటే పిల్లలలో లుకేమియా రోగాన్ని నిర్ధారించే ఐదు లక్షణలు ఇవే..
- అధిక రక్తస్రావం: శరీరంలో ఏదైనా భాగానికి గాయమైతే, ఆ గాయం చాలా రోజులు నయం కాదు. అంతేకాదు అధిక రక్తస్రావం అవుతుంది.
- తెల్ల రక్తకణాల అసమతుల్యత: ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడినవారిలో తెల్ల రక్తకణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది చాలా సందర్భాలలో రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, తరచుగా దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఎముకలలో నొప్పి: బ్లడ్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి.. ఎముకలలో నొప్పి. ఈ నొప్పి ఆర్థరైటిస్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకవేళ ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే, తక్షణమే డాక్టర్‌ను సంప్రదించండి.
- శరీరం పసుపు రంగులోకి మారడం కూడా బ్లడ్ క్యాన్సర్ సంకేతం
- ఆకస్మికంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలే.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
