AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defence Expo 2022: నేడు డిఫెన్స్‌ ఎక్స్‌పోను సందర్శించనున్న ప్రధాని మోడీ.. పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..

డిఫెన్స్‌ ఎక్స్‌ పో.. దేశ ఆయుధ సంపత్తి, సైనిక శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టనుంది. గుజరాత్‌లో 4 రోజుల పాటు జరగనున్న డిఫెన్స్‌ ఎక్స్‌పోను సందర్శించనున్నారు ప్రధాని మోదీ.

Defence Expo 2022: నేడు డిఫెన్స్‌ ఎక్స్‌పోను సందర్శించనున్న ప్రధాని మోడీ.. పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2022 | 8:01 AM

Share

డిఫెన్స్‌ ఎక్స్‌ పో.. దేశ ఆయుధ సంపత్తి, సైనిక శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టనుంది. ఆసియాలోనే  అతి పెద్ద డిఫెన్స్‌ ఎక్స్‌ పో 2022.. గుజరాత్‌‌లోని గాంధీనగర్‌లో మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎక్స్ పో మొత్తం ఐదు రోజుల పాటు జరగనుండగా.. రెండోరోజు బుధవారం ప్రధాని మోడీ పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. డిఫెన్స్ ఎక్స్ పో సందర్భంగా.. మహాత్మామందిర్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్, సబర్మతి రివర్ ఫ్రంట్ తో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సబర్మతి రివర్‌ ఫ్రంట్‌లో నేవీ సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక ఇవాల్టి నుంచి రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిఫెన్స్‌ ఎక్స్‌ పోను సందర్శించి.. పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. HAL రూపొందించిన స్వదేశీ శిక్షణ విమానం హెచ్ టిటి- 40 ని ఆవిష్కరించనున్నారు. ఇదే కార్యక్రమంలో మిషన్ డిఫ్ స్పేస్ ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ డిఫెన్స్‌ ఎక్స్‌ పో భారత్‌లోని రక్షణ సంబంధిత తయారీ సామర్థ్యాన్ని కళ్ళకు కట్టనుంది. ఈసారి థీమ్‌ 3డి, డీఆర్డీఓ, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఎకోస్పియర్, వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలు, రక్షణ పరికరాలు సాంకేతికతను ప్రదర్శించనున్నారు.

ఈవెంట్ 12వ ఎడిషన్ థీమ్ పాత్ టు ప్రైడ్. ఇది ఇండియా ఎట్‌ 75, ఆత్మనిర్భర్ భారత్ తో అనుసంధానం చేయబడింది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ ఉద్దేశ్యంతో జరుగుతున్న ఈ ఎక్స్‌పోలో..స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన అధునాతన ఆయుధ వ్యవస్థ, అంతర్గత భద్రతావ్యవస్థలు, సాంకేతికతను ప్రదర్శించనున్నారు.

డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్, సోనార్, మిస్సైల్, ఎయిర్ కాఫ్ట్ వంటి విభాగాల్లో పనిచేసే డీఆర్డీఓ నేతృత్వంలోని అనేక భారతీయ పరిశ్రమలు ఈ ఎక్సో పోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.

ఇవి కూడా చదవండి

డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ విజన్‌ను ప్రదర్శిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కర్టెన్ రైజర్‌లో ప్రకటించారు. ఈ ఎక్స్‌పో చివరి రెండు రోజుల్లో (అక్టోబర్ 21 – 22) ప్రజల కోసం తెరవనన్నారు. గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..