AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Water: రోజూ లెమన్ వాటర్ తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి.. మీకే మంచిది..

లెమన్ వాటర్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే.. నిమ్మ నీరు రుచితోపాటు.. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

Lemon Water: రోజూ లెమన్ వాటర్ తాగుతున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి.. మీకే మంచిది..
Lemon
Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2022 | 8:53 AM

Share

లెమన్ వాటర్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే.. నిమ్మ నీరు రుచితోపాటు.. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. ఆరోగ్యానికి అన్ని విధాలా ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనిని క్రమంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చాలా మంది రోజూ నిమ్మరసం తీసుకుంటారు. కావున అలాంటి వారు నిమ్మరసం తాగడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకోవాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆహారం తిన్న వెంటనే తాగొచ్చా..? లేదా.. భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.. నష్టాలేంటీ..? అసలు నిమ్మ నీటిని ఎలా తాగాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం తర్వాత నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అద్భుతమైన రోగనిరోధక శక్తి పానీయం. ఇది తాగడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, జలుబు, జ్వరం మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారం తిన్న తర్వాత నిమ్మరసం తాగితే అది చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా బరువు తగ్గడానికి ఇది చాలా మంచి పానీయం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే దీన్ని తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ బరువులో తేడా కనిపిస్తుంది. అయితే.. భోజనం చేయగానే తాగకుండా.. కొద్ది సమయం తర్వాత తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భోజనం చేసిన వెంటనే ఎందుకు తాగకూడదు..

భోజనం చేసిన వెంటనే ఎలాంటి శీతల పానీయాలకైనా దూరంగా ఉండాలి. మీరు భోజనం చేసిన వెంటనే ఏదైనా శీతల పానీయం తాగితే కడుపులో గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. కావున భోజనం చేసిన వెంటనే నిమ్మరసం తాగకుండా ఉండండి.

భోజనం చేసిన తర్వాత ఎప్పుడు తాగాలి..

భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల పాటు నిమ్మరసం తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే ఏదైనా పానీయం తాగడ మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా భోజనం చేసిన తర్వాత నిమ్మరసం కలిపిన చల్లటి నీళ్లను కూడా ఎప్పుడూ తాగకూడదు. ఎప్పుడూ వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!