AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Liver: ఈ పదార్థాలను రోజూ తీసుకుంటే లివర్ ఆరోగ్యం పదిలం.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే..

మానవ శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాధానపాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Healthy Liver: ఈ పదార్థాలను రోజూ తీసుకుంటే లివర్ ఆరోగ్యం పదిలం.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే..
Healthy Liver
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2022 | 12:11 PM

మానవ శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాధానపాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి అవయవాల్లో కాలేయం ఒకటి.. మనం తినే ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు అన్నీ కాలేయం ద్వారా నిర్వహించబడతాయి. శరీర ప్రక్రియలకు అవసరమైన అనేక అదనపు కొవ్వులు, ప్రోటీన్లు కూడా దాని నియంత్రణలో ఉంటాయి. సాధారణ ఆరోగ్యానికి కాలేయ ఆరోగ్యం చాలా అవసరం. అనారోగ్యకరమైన కాలేయం వల్ల జీవక్రియ సమస్యలు, కాలేయ వ్యాధి లాంటివి సంభవించవచ్చు. కాలేయానికి హాని కలిగించే అత్యంత సాధారణ అంశం టైప్ 2 డయాబెటిస్. ప్రతి ప్రమాద కారకాన్ని నియంత్రించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ఆహారాలు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు.. ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు.. పని తీరును మెరుగుపరిచే ఆహారాలు ఇవే..

  1. ద్రాక్ష: అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ద్రాక్షలో దాగున్నాయి. ఇవి ఎరుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. మంటను తగ్గించడంతోపాటు.. లివర్‌ను ఆరోగ్యంగా కాపాడతాయి. ఇంకా శరీరంలోని యాంటీఆక్సిడెంట్ స్థాయిలను కూడా పెంచుతాయి.
  2. ఆకుకూరలు: కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే ఆకు కూరలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకు కూరలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆహారంలో కూరగాయలను పెంచుకోవాలి. ఆకు కూరలు, బ్రోకలీ లాంటి వాటిని తినాలి. దీని ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి రక్షణ పొందవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. వోట్మీల్: వోట్మీల్ మీ ఆహారంలో ఫైబర్ పెంచడానికి ఒక సాధారణ మార్గం. ఓట్స్‌లో ఉండే ప్రత్యేక ఫైబర్‌లు కాలేయానికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియలో కీలకమైన భాగం. వోట్స్ రోగనిరోధక వ్యవస్థ మాడ్యులేషన్‌లో సహాయపడతాయి. ఇంకా వాపును తగ్గిస్తాయి. మధుమేహం, ఊబకాయంతో పోరాడడంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి.
  5. బెర్రీలు: బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బ్లూబెర్రీస్, క్రాన్‌బెర్రీస్ రెండింటిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌ల కార్యకలాపాలను, రోగనిరోధక కణాల ప్రతిస్పందనను కూడా మెరుగుపరుస్తాయి.
  6. కాఫీ: కాలేయ పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోగల ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి కాఫీ. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నవారిలో, కాఫీ తీసుకోవడం వల్ల సిర్రోసిస్ లేదా కాలేయం దెబ్బతినే అవకాశం తగ్గుతుంది. కాఫీ వినియోగం వల్ల కాలేయ అనారోగ్యం, వాపును నియంత్రించి లివర్ ను కాపాడుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులు రోజూ మూడు కప్పుల వరకు తీసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి