Munugode Bypoll: మునుగోడులో హీట్‌ పుట్టిస్తున్న పోస్టర్ పాలిటిక్స్‌.. ఫలిస్తున్న రాజన్న రాజీనామా అంటూ..

మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి. వారం రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు పడితే.. ఇవాళ సడెన్‌ రాజగోపాల్‌ అనుకూల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

Munugode Bypoll: మునుగోడులో హీట్‌ పుట్టిస్తున్న పోస్టర్ పాలిటిక్స్‌.. ఫలిస్తున్న రాజన్న రాజీనామా అంటూ..
Munugode Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2022 | 9:54 AM

మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి. వారం రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు పడితే.. ఇవాళ సడెన్‌ రాజగోపాల్‌ అనుకూల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం పరిసర ప్రాంతాలు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌‌ అనుకూల పోస్టర్లతో నిండిపోయాయి. ఫలిస్తున్న రాజన్న రాజీనామా పేరుతో పోస్టర్లను అంటించారు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని.. ప్రతి గ్రామానికి 20 లక్షల నిధులు వచ్చాయని పోస్టర్లు వేశారు. చౌటుప్పల్‌లో ఐదు డయాలసిస్‌ యూనిట్లతో పాటు హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారంటూ పోస్టర్లలో వెల్లడించారు.

ఇంతకుముందు రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు హల్‌చల్‌ చేశాయి. ఫోన్‌ పే తరహా కాంట్రాక్ట్‌ పే ద్వారా 18 వేల కోట్ల ట్రాన్జాక్షన్‌ రాజగోపాల్‌ ఖాతాలో జరిగిందంటూ పోస్టర్లు వెలిశాయి. రాజగోపాల్‌ రెడ్డికి 18 వేల కోట్లు కాంట్రాక్ట్‌ కేటాయించారంటూ వేల సంఖ్యలో షాపులు, గోడలకు రాత్రికే రాత్రి కొందరు అతికించారు మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు.. ఇట్లు దుబ్బాక ప్రజలు అంటూ చౌటుప్పల్‌లో పోస్టర్లు వెలిశాయి.

రోజుకో మండలంలో ఇలాంటి పోస్టర్లు కొందరు అతికించారు. వీటికి కౌంటర్‌గా ఇప్పుడు రాజగోపాల్‌ అనుకూల పోస్టర్లు దర్శనమిచ్చాయి. మొత్తానికి పోస్టర్‌ పాలిటిక్స్‌ మునుగోడులో హీట్‌ పుట్టిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని మనుగోడు వార్తల కోసం..