Munugodu Betting: కాయ్ రాజా కాయ్.. మునుగోడు ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్.. ఆయనపైనే అధికంగా..

బెట్టింగ్ కు కాదేది అనర్హం.. నిజమండీ బాబు.. ఇప్పటి వరకు క్రికెట్, కబడ్డీ మ్యాచ్ లకు పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు పాలిటిక్స్ కు పాకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మునగోడు బై ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ...

Munugodu Betting: కాయ్ రాజా కాయ్.. మునుగోడు ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్.. ఆయనపైనే అధికంగా..
Munugodu
Follow us

|

Updated on: Oct 17, 2022 | 11:11 AM

బెట్టింగ్ కు కాదేది అనర్హం.. నిజమండీ బాబు.. ఇప్పటి వరకు క్రికెట్, కబడ్డీ మ్యాచ్ లకు పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు పాలిటిక్స్ కు పాకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మునగోడు బై ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే విషయంపై డిస్కషన్. ఇంతటి హీట్ రేపుతున్న ఇన్సిడెంట్ ను బెట్టింగ్ బంగార్రాజులు ఎందుకు వదిలేస్తారండీ బాబూ..పందేనికి మేము రెడీ అంటూ మందుకొస్తున్నారు. వారు గెలుస్తారంటూ.. కాదు కాదు వీరే గెలుస్తారంటూ బెట్టింగ్ వేసేస్తున్నారు. ఇక ఎలక్షన్ జరగడానికి టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే జోరుగా పందేలు సాగడం చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల గెలుపోటములపై అప్పుడే బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌ తరహాలో పందేలు కాస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు. బెట్టింగ్‌ వేస్తూ కోట్ల రూపాయల్లో లావా దేవీలు సాగిస్తున్నారు. డబ్బు కోసం చౌటుప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు.

రాజగోపాల్‌రెడ్డిపై రూ.50 వేలు, కూసుకుంట్లపై రూ.30 వేలు, స్రవంతి గెలుపుపై రూ.20 వేల చొప్పున బెట్టింగ్ వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బెట్టింగ్ వేసినా నగదుకు రెట్టింపు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నికల ఖర్చు కోసం తరలిస్తున్న రూ.16 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఓ ప్రధాన పార్టీకి చెందిన డబ్బు వాహనంలో మునుగోడు ప్రాంతానికి రవాణా అవుతుండగా మార్గంమధ్యలో అడ్డుకుని పట్టుకున్నారు.

మరోవైపు.. మునుగోడులో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 795. జనవరి 1న ప్రకటించిన జాబితాలో 2 లక్షల 26 వేల 471 మంది ఓటర్లుంటే.. కొత్తగా ఓటుహక్కు కోసం 26,742 మంది అప్లయ్ చేసుకున్నారు. వీరిలో 10 వేల 792 మందిని అనర్హులుగా తేల్చారు. టోటల్‌గా మునుగోడులో కొత్తగా ఓటు హక్కు పొందిన అదృష్టవంతుల సంఖ్య 15 వేల 980గా తేలింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్‌పై క్లారిఫికేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.

ఇవి కూడా చదవండి

పెండింగ్‌లో ఉన్న ఫామ్ సిక్స్‌లన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన ఒకేఒక్క రోజులో జల్లెడ పట్టి.. సగానికి సగం బోగస్ అని తేల్చేసింది. మరుసటి రోజే మిగతా వాళ్లను ఒరిజినల్ ఓటర్లుగా ప్రకటించారు. టోటల్‌గా 10 వేల 792 మంది మునుగోడులో ఓటు హక్కు దొరక్క నిరాశపడ్డారు.

మరిన్ని మనుగోడు వార్తల కోసం..