Snake Venom: ఫ్రాన్స్ టు చైనా.. వయా భారత్.. అక్రమంగా తరలిస్తున్న రూ.30 కోట్ల పాము విషం స్వాధీనం..

ఫ్రాన్స్ నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కేజీల పాము విషాన్ని భారత అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Snake Venom: ఫ్రాన్స్ టు చైనా.. వయా భారత్.. అక్రమంగా తరలిస్తున్న రూ.30 కోట్ల పాము విషం స్వాధీనం..
Snake Venom
Follow us

|

Updated on: Oct 17, 2022 | 8:53 AM

ఫ్రాన్స్ నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కేజీల పాము విషాన్ని భారత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో దీని విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో.. ఫన్సిడేవా ప్రాంతంలోని ఘోష్పుకూర్ అటవీ ప్రాంతంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో శనివారం రాత్రి రెండున్నర కేజీల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ క్రిస్టల్ జార్‌లో నింపి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

పశ్చిమబెంగాల్‌ డార్జిలింగ్‌లో అధికారులు భారీ ఎత్తున పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అటవీ అధికారులు శనివారం రాత్రి 2.4 కేజీల విషాన్ని గుర్తించామని తెలిపారు. ఈ విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

పట్టుబడ్డ నిందితుడిని మహమ్మద్‌ సరాఫత్‌గా గుర్తించినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర దినాజ్‌పుర్‌ జిల్లాలోని ఖురాయి ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము విషం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ పాము విషం ఫ్రాన్స్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లోకి వచ్చిందని నిందితుడు చెప్పాడు. ఈ విషాన్ని భారత్ నుంచి నేపాల్‌కు తీసుకెళ్తున్నట్లు వివరించాడని.. అక్కడ నుంచి చైనాకు తీసుకెళ్లాలన్నది నిందితుల వ్యూహమని వివరించారు.

ఇదిలాఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి. జల్పాయ్‌గురి జిల్లాలో సెప్టెంబర్ 10న రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..