Jowar Benefits: జొన్న రొట్టెలు తిన‌డం వల్ల ఎలాంటి ప్రయోజనాలు? డయాబెటిస్‌ ఉన్నవారికి మంచిదేనా?

జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచివంటారు. మన భారతదేశంలో జొన్నలను బాగానే పండిస్తుంటారు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెలను తినేవారి సంఖ్య పెరిగిపోయింది..

Jowar Benefits: జొన్న రొట్టెలు తిన‌డం వల్ల ఎలాంటి ప్రయోజనాలు? డయాబెటిస్‌ ఉన్నవారికి మంచిదేనా?
Sorghum Benefits
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2022 | 1:13 PM

జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచివంటారు. మన భారతదేశంలో జొన్నలను బాగానే పండిస్తుంటారు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెలను తినేవారి సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే జొన్నల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చపాతీ మాత్రమే తినేవాళ్లు ఇప్పుడు జొన్న రొట్టెలను తినేందుకు ఇష్టపడుతున్నారు. జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం అనే చెప్పాలి. జొన్న రొట్టెల వల్ల ఎముక బలంగా ఉంటాయి. జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరుగుతాయి. దాని వల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జొన్నల్లో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల చెడు కోలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాని వల్ల గుండె జబ్బులు రాకుండా స్ట్రోక్‌ రాకుండా ఉంటాయి. అందుకు క్రమం తప్పకుండా జొన్న రొట్టెలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జొన్నరొట్టెలతో ప్రయోజనాలు:

☛ జొన్నల్లో గ్లూటెన్ ఉండదు.

☛ ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

☛ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణం ఉంది.

☛ జొన్నల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

☛ ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 వంటివి ఉండటం వల్ల ఎముకలకు ఎంతో బలం.

☛ బరువు తగ్గాలనుకునేవారికి జొన్నలు ఎంతో ఉపయోగకరం.

☛ మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

☛ జొన్న రొట్టె గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

☛ రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.

జొన్నల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉండే విధంగా చేస్తుంది. అలాగే రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత నుంచి బయటపడవచ్చు.

షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌..

జొన్నలతో డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. జొన్న రొట్టె డయాబెటిస్‌ వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. జొన్నల్లో ప్రోటీన్స్‌, ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటితో పాటు గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి