AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ చిట్కాలు పాటించండి అద్భుతమైన ప్రయోజనాలు

Weight Loss Tips: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. అయితే బరువు..

Weight Loss: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ చిట్కాలు పాటించండి అద్భుతమైన ప్రయోజనాలు
Weight Loss
Subhash Goud
|

Updated on: Oct 17, 2022 | 12:53 PM

Share

Weight Loss Tips: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. అయితే బరువు తగ్గాలంటే ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయమం ఉండాలంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునేవారు కేవలం తాత్కాలికంగా బరువుపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాలంగా బరువు తగ్గేందుకు దృష్టి సారించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే బరువు తగ్గేందుకు మూడు కీలక ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

  1. ఆహార నియమాలలో.. చాలా మందికి ఆహార నియమాలు అనేవి పాటించరు. బరువును తగ్గించుకునేందుకు సరైన మార్గాలను ఎంచుకుంటే మేలంటున్నారు. తీసుకునే పోషకాహారం ఓ ట్రెండ్‌ లేదా తాత్కాలిక ఫలితాన్నిచ్చే ఓ ఆయుధంలా కాకుండా దాన్ని జీవనశైలిగా మార్చుకోవాలంటున్నారు. ఆహారపు అలలవాట్లను సరిదిద్దుకుని, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లతో కూడిన పోషకాహారాన్ని ఎంచుకోగలిగితే, కొవ్వును కరిగించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ప్రతి రోజూ తీసుకోవాలి.
  2. క్రమం తప్పకుండా వ్యాయామం: ఒకేసారి భారీ వర్కవుట్‌ చేయలేకపోతే, తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేయడం ఎంతో మేలు. ఎవరికి వారు వారికి సూటయ్యే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. కొందరికి జిమ్‌కి వెళ్లడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటివాళ్లు జాగింగ్‌, రన్నింగ్‌ లేదా సైక్లింగ్‌ చేయడం ఎంచుకోవడం బెటర్‌. మరికొందరికి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ నచ్చకపోతే.. ఎలాంటి వ్యాయామం ఎంచుకున్నా క్రమం తప్పకూడదు. ఫిట్‌నెస్‌, మెటబాలిజం.. ఈ రెండింటినీ వ్యాయామం ప్రభావితం చేస్తుంది. కేవలం క్యాలరీలను కరిగించడమే ధ్యేయంగా కాకుండా, శరీరాన్ని ఓ పాజిటివ్‌ స్ట్రెస్‌కు లోను చేయడం అలవాటు చేసుకోవడం మంచిదంటుటున్నారు.
  3. సరైన నిద్ర.. కాగా, నిద్రకు మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. నిద్రను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. శరీరం రికవర్‌ అవడానికి, బింజ్‌ ఈటింగ్‌ను ప్రభావితం చేసే కార్టిసాల్‌ హార్మోన్‌ సక్రమ పనితీరుకు కంటి నిండా నిద్ర అవసరం. శరీరం తనకు తాను ఆరోగ్య వ్యవస్థల్లోని పొరపాట్లను సరిదిద్దుకుని, ఒత్తిడిని తగ్గించుకునే వెసులుబాటు నిద్రలోనే పొందుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రకు కొరత రానివ్వకూడదని అంటున్నారు నిపుణులు. అలాగే పోషకాలు శరీరమంతటా ప్రసరించడానికి తోడ్పడే నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. శరీరంలో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండడానికీ, కలుషితాల విసర్జనకూ కూడా సరిపడా నీరు అవసరం. దాహార్తికీ ఆకలికీ మధ్య తేడా విషయంలో శరీరం అయోమయానికి లోనవుతూ ఉంటుంది. అందుకే అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉండాలంటే దాహం వేసే లోపే నీళ్లు తాగుతూ ఉండాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..