AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్‌లో సరికొత్త పాస్‌కీ ఫీచర్.. పాస్‌వర్డ్‌ లేకుండానే లాగిన్‌..!

టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి మీ..

Google: గూగుల్‌లో సరికొత్త పాస్‌కీ ఫీచర్.. పాస్‌వర్డ్‌ లేకుండానే లాగిన్‌..!
Google
Subhash Goud
|

Updated on: Oct 14, 2022 | 7:14 PM

Share

టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి మీ గూగుల్‌ అకౌంట్లకు పాస్‌వర్డ్‌ లేకుండానే లాగిన్‌ చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లు క్రోమ్‌ కోసం కొత్త పాస్‌కీ ఫీచర్‌ను విడుదల చేసింది. మీ పాస్‌వర్డ్‌ని ఉపయోగించకుండా ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ చేసేందుకు పిన్‌లు లేదా బయోమెట్రిక్‌ను ఉపయోగించి లాగిన్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఐటెంటిటీ అథెంటికేషన్‌ కోసం ఈ ఆప్షన్‌ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం డెవలపర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి వరకు సాధారణ వినియోగదారులకు పాస్‌కీల ఫీచర్‌ను అందించాలని యోచిస్తోంది. గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌కి బ్యాకప్‌ చేయబడుతుంది. సమస్యల గురించి చింతించకుండా ఆండ్రాయిడ్‌ పరికరాలలో పాస్‌కీలను సష్టించగలరని కంపెనీ చెబుతోంది.

ఈ సంవత్సరం మే నెలలో మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు యూజర్లకు సాధారణ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఆప్షన్ ప్రకటించాయి. దీనిని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం, ఎఫ్‌ఐడీవో అలయన్స్ డెవలప్ చేసిన పాస్‌కీ అని పిలుస్తారు.

అయితే గూగుల్‌ పాస్‌వర్డ్‌ మాదిరిగా కాకుండా పాస్‌కీ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్‌ అవుతుందని దీనిని మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదని చెబుతోంది గూగుల్‌. పాస్‌వర్డ్ అనేది ఆటోఫిల్‌ లాగా ఈ పాస్‌కీ పని చేస్తుందని, పాస్‌కీ గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌కు బ్యాకప్‌ అవుతుంది కాబట్టి మళ్లీ చేయాల్సిన అవసరం రాదు. ఇది యూజర్‌ డివైజ్‌ నుంచి మాత్రమే వస్తుంది. ఫోన్‌ ను ఎవరైనా చోరీ చేసిన సమయంలో వారు సైన్‌ ఇన్‌ చేయకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!