- Telugu News Photo Gallery Technology photos Iphone 11 can buy at 17k in flipkart big diwali sale Telugu Tech News
Iphone 11: రూ. 17 వేలకే ఐఫోన్ 11ని సొంతం చేసుకునే అవకాశం.. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలంటే..
ఐఫోన్ అంటేనే సహజంగా ధర ఎక్కువగా ఉంటుందని తెలుసు. అయితే ఆఫర్‌లో భాగంగా రూ. 34 వేల ఫోన్‌ను రూ. 17 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా ఈ అవకాశం లభించింది..
Updated on: Oct 14, 2022 | 12:28 PM

పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డ ఈ కామర్స్ సైట్స్ వరుస ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఐఫోన్ 11ని రూ. 17 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

ఐఫోన్ 11 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 9910 తగ్గింపు ధరతో రూ. 33,990గా ఉంది. అయితే ఎస్‌బీఐ లేదా కొటాక్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 32,740కి అందుబాటులో ఉంది.

ఇక బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 16,900 తగ్గింపు ధర పొందొచ్చు. ఒకవేళ మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే రూ. 16,900 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఐఫోన్11ని కేవలం రూ. 17,090కే సొంతం చేసుకోవచ్చు.

దీనిపై అదనంగా మళ్లీ కొటాక్ లేదా ఎస్‌బీఐ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 15,840కి సొంతం చేసుకోవచ్చు.

ఇక ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. స్క్రాచ్ రెసిస్టెంట్స్ గ్లాస్ దీని ప్రత్యేకగా చెప్పొచ్చు. ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఐఫోన్ 11లో 12 మెగాపిక్సెల్ రెఇర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 3110 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫేస్‌ఐడీ, అల్ట్రా వైడ్‌బ్యాడ్‌కు సపోర్ట్ చేస్తుంది.





























