NASA Artemis-1: ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి మూడోసారి ముహూర్తం.. నవంబర్‌ 14న నింగిలోకి..

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి మూడోసారి ముహూర్తం ఫిక్సైంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఆర్టెమిస్-1..

NASA Artemis-1: ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి మూడోసారి ముహూర్తం.. నవంబర్‌ 14న నింగిలోకి..
Nasa Artemis 1
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 14, 2022 | 7:59 AM

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి మూడోసారి ముహూర్తం ఫిక్సైంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఆర్టెమిస్-1.. ముచ్చటగా మూడోసారి ప్రయోగానికి రెడీ అవుతోంది. ఈసారి ఫ్లోరిడా నుంచి కాకుండా హాంగర్‌ నుంచి నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది నాసా. చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ చివరి నిమిషంలో ఆగిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 29న మొదటిసారి ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి సిద్ధమైంది నాసా. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపేందుకు కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టింది. అయితే, రాకెట్‌ దూసుకెళ్లాల్సిన చివరి నిమిషంలో ఆయిల్‌ లీకేజీని గుర్తించి నిలిపివేసింది.

ఆ తర్వాత సెప్టెంబర్‌ 3న తిరిగి ప్రయోగానికి సిద్ధమైన నాసాకు మళ్లీ అదే సమస్య తలెత్తడంతో మరోసారి ఆగిపోయింది. ఇప్పుడు, ముచ్చటగా మూడోసారి ఆర్టెమిస్‌-1 ప్రయోగానికి ముహర్తం నిర్ణయించింది నాసా. నవంబర్‌ 14న ఆర్టెమిస్‌-1ని చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే, లాంచ్‌ ప్యాడ్‌ను ఫ్లోరిడా నుంచి హాంగర్‌కు మార్చింది నాసా. ఫ్లోరిడాలో హరికేన్స్‌ బీభత్సం సృష్టిస్తుండటంతో ఆర్టెమిస్‌-1ను హాంగర్‌ నుంచి ప్రయోగించబోతోంది. నవంబర్‌ 4 నాటికి హాంగర్‌ లాంఛ్‌ ప్యాడ్ దగ్గరకు ఆర్టెమిస్‌-1ను షిఫ్ట్‌ చేయనున్నారు. నాసా అనుకున్నట్టు జరిగితే నవంబర్‌ 14న నింగిలోకి దూసుకుపోనుంది ఆర్టెమిస్‌-1.

మళ్లీ ఏదైనా తేడా జరిగితే మాత్రం నవంబర్‌ 16 లేదా 19న మరో ల్యాంఛ్ ప్యాడ్‌ నుంచి ప్రయోగం చేపట్టేందుకు బ్యాకప్‌ డేట్స్‌ని కూడా రెడీ చేసుకుంది నాసా. చంద్రుడిపై శాశ్వత నివాసాలే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపడుతోంది నాసా. ఆర్టెమిస్‌-1ని మారవరహితంగా పంపుతోంది. ఇది సక్సెసైతే మానవ సహిత ప్రయోగాలు చేపట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది నాసా. మరి, నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1 ప్రయోగం మూడోసారైనా సవ్యంగా సాగుతుందా? లేదా? చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే