Apple Watch: కాంగ్రాట్స్‌ మీరు తల్లి కాబోతున్నారు.. యూజర్‌ను ఆశ్చర్యానికి గురి చేసిన యాపిల్‌ వాచ్‌..

స్మార్ట్ వాచ్‌ల వినియోగం ఇప్పుడు సర్వసాధరణంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం సమయాన్ని చూసుకోవడానికే ఉపయోగపడే స్మార్ట్‌ వాచ్‌లు నేడు అన్ని రకాల పనులు చేస్తున్నాయి. బీపీ, ఆక్సిజన్‌ లెవల్స్‌, వాకింగ్‌ ఇలా శరీరంలో జరిగే ఎన్నో మార్పులను స్మార్ట్‌ వాచ్‌ ఇట్టే పసిగట్టేస్తోంది...

Apple Watch: కాంగ్రాట్స్‌ మీరు తల్లి కాబోతున్నారు.. యూజర్‌ను ఆశ్చర్యానికి గురి చేసిన యాపిల్‌ వాచ్‌..
Apple Watch
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 14, 2022 | 7:37 AM

స్మార్ట్ వాచ్‌ల వినియోగం ఇప్పుడు సర్వసాధరణంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం సమయాన్ని చూసుకోవడానికే ఉపయోగపడే స్మార్ట్‌ వాచ్‌లు నేడు అన్ని రకాల పనులు చేస్తున్నాయి. బీపీ, ఆక్సిజన్‌ లెవల్స్‌, వాకింగ్‌ ఇలా శరీరంలో జరిగే ఎన్నో మార్పులను స్మార్ట్‌ వాచ్‌ ఇట్టే పసిగట్టేస్తోంది. ముందే జరిగే ప్రమాదాలను గుర్తిస్తున్నాయి. ఇప్పటికే హృద్రోగాలకు సంబంధించి యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ యూజర్‌ను ముందుగానే అలర్ట్‌ చేసిందన్న వార్త అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే యాపిల్‌ స్మార్ట్ వాచ్‌ ఓ మహిళ తల్లి కాబోతున్న విషయాన్ని పరీక్షలు చేయించుకునే కంటే ముందే తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి ఆ మహిళ తన స్వీయ అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ యాపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ వాచ్‌ను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ 34 ఏళ్ల మహిళ హార్ట్‌బీట్ పెరుగుతున్నట్లు వాచ్‌ అలర్ట్స్‌ చూపించింది. సాధారణంగా తన హార్ట్‌ బీట్‌ 57 ఉండగా.. వాచ్‌లో 72కి పెరిగినట్లు చూపించింది. 15 రోజులుగా హార్ట్‌బీట్‌ పెరుగుతున్నట్లు వాచ్‌ హెచ్చరిస్తూనే ఉంది. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన సదరు మహిళ బహుశా కోవిడ్‌ అయ్యుండొచ్చని పరీక్ష చేయించుకుంది. కానీ కోవిడ్ టెస్ట్ నెగిటివ్‌ వచ్చింది.

అనంతరం ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేయగా గర్భం దాల్చిన మొదటి వారాల్లో కూడా మహిళల హార్ట్‌ బీట్ పెరుగుతుందని తెలుసుకున్న ఆ మహిళ.. వెంటనే ప్రెగ్నసీ టెస్ట్‌ చేయించుకుంది. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ మహిళ గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఇలా స్మార్ట్‌ వాచ్‌ ఇచ్చిన అలర్ట్‌ మేరకు టెస్ట్ చేయించుకోగా అసలు విషయం తెలియడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..