ఆనాడు నాసా వద్దన్నా అంతరిక్ష యాత్రకు వెళ్లాడు.. నేడు ఏకంగా భార్యతో కలిసి చంద్రుడిపైకే..
డెన్నిస్ టిటో 2001లో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించారు. టిటో కంటే ముందు, ఒక జపాన్ బిలియనీర్ కూడా చంద్రుని పర్యటన కోసం టిక్కెట్లు బుక్ చేయగా, మిగిలిన టిక్కెట్లు ఇంకా బుక్ కాలేదు.
Updated on: Oct 13, 2022 | 8:13 PM

టిటో అనే రష్యన్ 2001లో అంతరిక్షంలోకి వెళ్లాడు. ప్రయాణంతోపాటు ఇతర ఖర్చులను కూడా తనే భరించాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వ్యతిరేకించినా టిటో అంతరిక్ష యాత్రకు వెళ్లాడు. అయితే, ఆ సమయంలో రష్యన్ స్పేస్ ఏజెన్సీకి డబ్బు అవసరమైంది. దానిని టిటో నెరవేర్చాడు.

ప్రపంచంలోనే తొలి అంతరిక్ష యాత్రికుడు డెన్నిస్ టిటో చంద్రుడిపైకి వెళ్లేందుకు రెండు టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. 82 ఏళ్ల టిటోతో కలిసి ఆయన భార్య అకికో కూడా చంద్రుడిపైకి వెళ్లనున్నారు. ఇద్దరూ SpaceX స్టార్‌షిప్ రాకెట్ ద్వారా చంద్రునికి బయలుదేరుతారు. ఈ ప్రయాణం దాదాపు వారం రోజులు ఉంటుంది. ప్రణాళిక ప్రకారం, మరో 10 మంది పర్యాటకులు కూడా చంద్రునిపైకి వెళ్లనున్నారు.

ఈ ప్రయాణానికి ముందు ఇంకా ఎన్నో పరీక్షలు చేయాల్సి ఉంది. నివేదికల ప్రకారం, పర్యటన తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ ప్రయాణానికి ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందనే వివరాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు. డెన్నిస్ టిటో 2001లో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించారు. టిటో కంటే ముందు, ఒక జపాన్ బిలియనీర్ కూడా చంద్రుని పర్యటన కోసం టిక్కెట్లు బుక్ చేయగా, మిగిలిన టిక్కెట్లు ఇంకా బుక్ కాలేదు.

అప్పుడు రష్యన్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష విమాన ఖర్చు $ 20 మిలియన్లు. స్టార్‌షిప్ కోసం ఇంకా చాలా పరీక్షలు, అభివృద్ధి మిగిలి ఉన్నాయని టిటో వార్తా సంస్థ APకి తెలిపారు. ఆగస్ట్ 2021లో స్పేస్‌ఎక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐదేళ్లలోపు విమానయానం చేసే అవకాశం ఉందని ఆయన తెలిపాడు.

5 ఏళ్ల ఒప్పందం ప్రకారం అప్పటికి టిటో వయసు 87 ఏళ్లు. టిటో రెండేళ్ల క్రితం తన కంపెనీని విల్‌షైర్ అసోసియేట్స్‌కు విక్రయించాడు. అంతరిక్ష ప్రయాణం వారిని ఉత్తేజపరుస్తుంది. అంతరిక్షయానం కోసం డబ్బు ఖర్చు చేసినందుకు చింతించడం లేదని ఆయన తెలిపాడు.





























