Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquito Ring: ఉంగరం వేలికి పెట్టుకుంటే దోమలు దగ్గరకు కూడా రావు.. జర్మన్ సైంటిస్టుల ఆవిష్కరణ.. ఎలా పని చేస్తుందంటే..

రింగు పెట్టుకోండి.. అదృష్టం మీ వెంటే.. ఇది ప్రకటన కాదు బాబు.. ఇది నిజం. ఈ రింగు పెట్టుకుంటే అదృష్టం పక్కన పడితే దోమలు మాత్రం దగ్గరకు రావు. 

Mosquito Ring: ఉంగరం వేలికి పెట్టుకుంటే దోమలు దగ్గరకు కూడా రావు.. జర్మన్ సైంటిస్టుల ఆవిష్కరణ.. ఎలా పని చేస్తుందంటే..
3d Printed Wearable Ring
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 13, 2022 | 12:24 PM

దోమలు కుడుతున్నాయనే ఆందోళన వద్దు. దోమల లెక్క తేలిపోయింది. అవి మన దగ్గరికి రావాలంటే వణికిపోవల్సిందే. ఎందుకంటే ఓ సైటింటిస్ట్ అభివృద్ది చేసిన రింగ్ అంత పవర్ ఫుల్.. జర్మనీలోని మార్టిన్‌ లూథర్‌ యూనివర్సిటీ హలే-విటెన్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటిదే ఒక ఉంగరాన్ని త్రీడీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దోమలు, ఇతర కీటకాలను ఎక్కువ కాలం దూరంగా ఉంచడానికి శాస్త్రవేత్తలు కొత్త 3డి ప్రింటెడ్ వేరబుల్ రింగ్‌ను అభివృద్ధి చేశారు. జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్శిటీ హాలీ-విట్టెన్‌బర్గ్ (ఎంఎల్‌యూ) పరిశోధకులు ఒక సాధారణ క్రిమి వికర్షకం “ఏఆర్ 3535″ని ఉపయోగించి వారి నమూనాను అభివృద్ధి చేశారు. ఏఆర్ 3535 కలిగిన దోమల స్ప్రే చర్మంపై చాలా సున్నితంగా ఉంటుందని.. చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నామని.. అందుకే దీనిని మా ప్రయోగాలకు ఉపయోగిస్తున్నామని MLU ప్రొఫెసర్ రెనే ఆండ్రోచె తెలిపారు. ఇది సాధారణంగా స్ప్రే లేదా లోషన్ రూపంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రభావం చాలా గంటల రక్షణను అందిస్తుందని ఆయన వివరించారు. అందుకే ఇప్పుడు త్రీడీ ప్రింటెడ్ వేరబుల్ రింగ్ తయారైంది.

ఉంగరం ఎలా తయారు చేశారంటే?

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. శాస్త్రవేత్తల బృందం ఒక బయోడిగ్రేడబుల్ పాలిమర్‌లోకి క్రిమి వికర్షకాన్ని నియంత్రించడానికి.. ఇంజెక్ట్ చేసి, వివిధ మార్గాల్లో పదార్థాల మిశ్రమాన్ని ఉపయోగించి ఈ ప్రత్యేక 3D-ప్రింటింగ్ సాంకేతికతను రెడీ చేశారు. “ప్రాథమిక ఆలోచన ఏంటంటే, క్రిమి వికర్షకం నిరంతరం ఆవిరైపోతుంది. కీటకాలకు అడ్డంకిని సృష్టిస్తుంది” అని ఎంఎల్‌యూ డాక్టరల్ అభ్యర్థి ఫ్యాన్‌ఫాన్‌డు అన్నారు.

మరింత పరిశోధన ఇంకా అవసరం..

వివిధ ప్రయోగాలు, అనుకరణలను నిర్వహించిన తర్వాత 37°C శరీర ఉష్ణోగ్రత వద్ద దోమల వ్యతిరేక ద్రవం వెదజల్లడానికి ఒక వారం కంటే ఎక్కువ సమయం పడుతుందని బృందం అంచనా వేసింది. ఇందులో ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషించవచ్చు. అయితే, వాస్తవ పరిస్థితుల్లో ఉంగరాలు ఎంత బాగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం