Indian Railway: రైలు బోగీలపై కనిపించే ఈ గీతలను మీరెప్పుడైనా గమనించారా..? వాటి అర్థం ఏంటో తెలుసుకోండి

చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. సామాన్యులకు తక్కువ ఛార్జీలతో అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం మాత్రమే. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు..

Indian Railway: రైలు బోగీలపై కనిపించే ఈ గీతలను మీరెప్పుడైనా గమనించారా..? వాటి అర్థం ఏంటో తెలుసుకోండి
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2022 | 7:32 AM

చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. సామాన్యులకు తక్కువ ఛార్జీలతో అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం మాత్రమే. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చున్న రైలులోని బోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి. ఆ గీతలను మీరెప్పుడైనా గమనించారా..? చదువు రానివారు కూడా కోచ్‌ల గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి. అయితే ఈ బోగీలపై గీసిన గీతల అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతి భోగీ పైన వివిధ రకాల రంగులతో గీతలు ఉంటాయి. ఆ రంగులను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి. 1853 ఏప్రిల్ 16న భారతీయ రైల్వే తన సేవలను ప్రారంభించింది. భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు బొంబాయి (బోరి బందర్), థానే మధ్య నడిచిందని రైల్వే వివరాలు చెబుతున్నాయి.

  1. బోగీ పై పసుపు గీతలు ఉంటే: బోగీ చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్ అని అర్థం. అంటే అది జనరల్ కోచ్ అని. ఇందులో టికెట్ నెంబర్ అవసరం లేదు.
  2. నీలి రంగు లో పసుపు గీతలు ఉంటే: రైలు బోగీపై పసుపు రంగు చారలు ఉంటే అనారోగ్యం ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన బోగీ అని అర్థం. అంటే అంగవైకల్యం ఉన్న వారికి కేటాయించిన బోగీ.
  3. బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే: రైలు బోగీపై బుడిద రంగులో ఎరుపు గీతలు ఉన్నట్లయితే అది ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్‌క్లాస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఈ బోగీలో ప్రయాణించవచ్చు.
  4. ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే: రైలు బోగీపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్‌ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇలాంటి బోగీలు ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బోగీ పై తెల్లని గీతలు ఉంటే: నీలి రంగు డబ్బా బోగీపై లేత నీలం లేదా తెలుపు రంగు గీతలు ఉన్నట్లయితే అది స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్