Crime News: దారుణం.. యూట్యూబ్ చూస్తూ బాలిక ప్రసవం.. ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే..?

మహారాష్ట్ర పూణెలోని కొండ్వే ధావండే ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలిక ఇంట్లోనే పాపకు జన్మనిచ్చింది. యూట్యూబ్‌లో వీడియో చూసి మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది.

Crime News: దారుణం.. యూట్యూబ్ చూస్తూ బాలిక ప్రసవం.. ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే..?
Child
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2022 | 7:53 AM

మహారాష్ట్ర పూణెలోని కొండ్వే ధావండే ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలిక ఇంట్లోనే పాపకు జన్మనిచ్చింది. యూట్యూబ్‌లో వీడియో చూసి మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం.. అప్పుడే పుట్టిన పసికందును కిటీలో నుంచి బయటకు విసిరేసింది. ఇంట్లో ప్రసవించిన తర్వాత పసికందును రెండో అంతస్తు నుంచి విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఉత్తమ్‌నగర్​ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా కమిషన్​సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్​గర్భవతి కావచ్చేమోనని అనుమానించి పరీక్ష చేయించాలని సూచించారు. అయినప్పటికీ.. తల్లీకూతురు పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ క్రమంలో వారు నివసిస్తున్న ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువు స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు బాలిక ఆస్పత్రిలో చేరడంతోపాటు.. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను ప్రశ్నించగా విస్తుపోయే విషయాలను వెల్లడించింది. యూట్యూబ్లో వీడియో చూసి తానే బిడ్డకు జన్మనిచ్చానని.. ఆ తరువాత కిటికీ నుంచి కిందకు విసిరేసినట్లు వెల్లడించింది. కాగా.. బిడ్డకు చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి, బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ బాలిక గర్భవతిగా ఉన్నప్పుడు.. ఆమె తనిఖీకి వెళ్ళినప్పుడు వైద్యులు ఆమెకు సమాచారం ఇచ్చారా..? లేదా? అనే విషయాలపై కూడా దర్యాప్తు చేయాలని సూచించారు. రెండు రోజుల నవజాత శిశువును చికిత్స కోసం ససూన్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!