Bharat Jodo Yatra: కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి.. 4 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర.. భారీ ఏర్పాట్లు..

ఏపీ సరిహద్దు గ్రామమైన హాలహర్వి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చత్రగుడి హనుమాన్ ఆలయం నుంచి రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

Bharat Jodo Yatra: కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి.. 4 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర.. భారీ ఏర్పాట్లు..
Bharat Jodo Yatra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2022 | 7:31 AM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మంగళవారం (అక్టోబర్ 18) ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు నుంచి నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీ సరిహద్దు గ్రామమైన హాలహర్వి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. చత్రగుడి హనుమాన్ ఆలయం నుంచి రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 10.30 గంటలకు ఆలూరు సిటీలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఈ పాదయాత్రలో ఏపీ నాయకులతోపాటు.. తెలంగాణకు చెందిన నేతలు కూడా పాల్గొంటున్నారు.

రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం హాలహర్వి వద్ద భారీ ఏర్పాట్లు, పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర 41 రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు ఏపీలో భారత్ జోడోయాత్ర జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 96 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులంతా ఈ యాత్రలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

చాగి నుంచి రేపు ఉదయం 6.30 నిమిషాలకు రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభమై కల్లుదేవకుంట గ్రామం వరకు కొనసాగనుంది. 21న మంత్రాలయం గుడి సర్కిల్ నుంచి మాధవరం బ్రిడ్జి వరకు సాగనుంది.

23న తెలంగాణలోకి

భారత్‌ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ చేరుకొని.. దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాదయాత్రకు రాహుల్‌ గాంధీ విరామం ఇవ్వనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది. ఆ తర్వాత 26 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!