AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అమ్మను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సర్ .. పోలీసులకు ఫిర్యాదు చేసిన బుడతడు..

మా మమ్మీ నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను జైలులో పెట్టండి..అంటూ ఆ పిల్లవాడు ఒక మహిళా కానిస్టేబుల్‌తో చెప్పాడు. అతను తన తల్లిని చాక్లెట్స్‌ అడిగితే..అమ్మ తనను కొడుతుందని కూడా ఆ బుడతడు చెప్పడం వీడియోలో కనిపించింది.

మా అమ్మను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సర్ .. పోలీసులకు ఫిర్యాదు చేసిన బుడతడు..
Kids Innocent Complaint
Jyothi Gadda
|

Updated on: Oct 17, 2022 | 9:02 PM

Share

చాక్లెట్లు, మిఠాయిలు తిననివ్వని తన తల్లిపై 3 ఏళ్ల చిన్నారి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ చిన్నారి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలో క్యూట్ కిడ్ తన తల్లి చాక్లెట్లు తినడానికి అనుమతించకపోవడంతో ఆమెపై ఫిర్యాదు చేయడం చూడవచ్చు. మా మమ్మీ నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను జైలులో పెట్టండి..అంటూ ఆ పిల్లవాడు ఒక మహిళా కానిస్టేబుల్‌తో చెప్పాడు. అతను తన తల్లిని చాక్లెట్స్‌ అడిగితే..అమ్మ తనను కొడుతుందని కూడా ఆ బుడతడు చెప్పడం వీడియోలో కనిపించింది. పిల్లల సమస్యలపై తీవ్రమైన శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తూ, కానిస్టేబుల్ ప్రతి పాయింట్‌ను జాగ్రత్తగా రాసుకుంటుంది. ఈ చిలిపి కేసు బుర్హాన్‌పూర్ జిల్లాలోని దేఢ్‌తలై గ్రామంలో వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్‌లోని బుధన్‌పూర్ జిల్లాలో డెడ్తలై గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు ఇటీవల తన తండ్రితో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననీయడం లేదని, తనను కొడుతున్నదని ఆ బుడతడు ఆరోపించాడు. అమ్మ నా చాక్లెట్స్‌ దొంగిలించింది. ఆమెను జైలులో పెట్టండి అని అమాయకంగా ఫిర్యాదు చేశాడు. కాగా, ఎస్‌ఐ ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా బాలుడ్ని నమ్మించారు. తన తల్లిపై ఆ బుడతడు చేసిన ఆరోపణలను అందులో నమోదు చేసింది. అనంతరం ఆ బాలుడికి ఆమె నచ్చజెప్పారు. అతడి తల్లి మంచిదని, అతడి మంచి కోసమే ఆమె అలా చేస్తున్నదని చెప్పి ఇంటికి పంపారు. బాలుడి ఫిర్యాదుపై తామంతా నవ్వుకున్నట్లు వెల్లడించారు.

https://dainik-b.in/zlj8lRQTbub

ఇవి కూడా చదవండి

మరోవైపు తమ కుమారుడికి స్నానం చేయించిన తర్వాత అతడి తల్లి కాటుక పెడుతుండగా చాక్లెట్‌ కోసం మారం చేయడంతో ఆమె కొట్టిందని బాలుడి తండ్రి తెలిపాడు. దీంతో ఏడ్చిన అతడు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మారం చేయడంతో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాగా, ఆ బుడతడు తన తల్లి గురించి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి