AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లో వింత మనుషులు.. కీటకాల గుడ్లను దేవుడి ఆహారంగా తింటున్నారు..! వంటకం ధర తెలిస్తే కళ్లు బైర్లే..!!

ప్రపంచంలో అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. వీటిలో మీరు ఎన్నడూ వినని లేదా చూడని ఆహారం ఒకటి ఉంది. ఇక్కడి ప్రజలు కీటకాల గుడ్లను దేవుళ్ల ఆహారంగా భావించి తింటారు. ఇంతకీ ఎక్కడ.? ఏంటి..? అన్న విషయానికి వస్తే...

వీళ్లో వింత మనుషులు.. కీటకాల గుడ్లను దేవుడి ఆహారంగా తింటున్నారు..! వంటకం ధర తెలిస్తే కళ్లు బైర్లే..!!
Eggs Of Insects
Jyothi Gadda
|

Updated on: Oct 17, 2022 | 6:58 PM

Share

ప్రపంచంలో ఆహారాలకు లోటు లేదు. ఆయా ప్రాంతాలు, సంస్కృతి ప్రకారం ఆహారపు అలవాట్లను కొనసాగిస్తుంటారు. వీటిలో ఒక వైపు సాధారణ ఆహారాలు, మరొక వైపు వింత ఆహారాలు ఉన్నాయి. వీరిలో రెండవ విభాగం మెక్సికో నగరంలో కీటకాల గుడ్లను దేవతల ఆహారంగా తినే వ్యక్తులు కొందరు ఉన్నారు. ఈ కీటకాల గుడ్లు తినడం వెనుక ఒక నమ్మకం ఉంది.

నివేదికల ప్రకారం…మెక్సికో సిటీకి చాలా దూరంలో ఉన్న లేక్ టెక్స్కోకో చెరువులో వాటర్ ఫ్లై (దోమ) కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లై గుడ్లను అహుటిల్ అంటారు. అహుట్లే అంటే ఆనందానికి బీజం అని అర్థం. ఇది పరిమాణంలో బఠానీ కంటే చిన్నది. దీనిని మెక్సికో నగర ప్రజలు వినియోగిస్తారు. 14-15వ శతాబ్దంలో మెక్సికోలోని అజ్టెక్ సామ్రాజ్యం నుండి ప్రజలు దీనిని వినియోగిస్తున్నారు.

గుడ్లు ఎలా సేకరిస్తారంటే..

ఇవి కూడా చదవండి

మత్స్యకారులు నీటిలో దోమలు పెట్టే గుడ్లను సేకరిస్తారు. అయితే, ముందుగా నీటి ఉపరితలం క్రింద ఒక పెద్ద వల కట్టబడుతుంది. దానిపై దోమలు లేదా ఈగలు గుడ్లు పెడతాయి. దీనిని మత్స్యకారులు, ఆయా ప్రాంత రైతులు సేకరించి ఎండలో ఆరబెడతారు.

గుడ్డు వినియోగాన్ని తగ్గించిన యువకులు.. 14వ శతాబ్దం నుండి ప్రజలు కీటకాల గుడ్లను తింటున్నారని సమాచారం. కానీ నేటి యువతలో దీని వినియోగం తగ్గుతోంది. అందువల్ల మెక్సికో నగరంలోని అనేక రెస్టారెంట్లు డిష్‌ను అందించవు. అలాగని ఈ డిష్ అంత చవకైనది కాదు. ధరలో చాలా ఖరీదైనది. 2019లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ఒక చిన్న జార్ గుడ్డు ధర రూ. 1600 వరకు ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి