Watch: 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ.. ఫేస్ బుక్ లో లైవ్.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూడండి..
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత పారిపోయిన కంటైనర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అయితే ఆ కారు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న లైవ్ స్ట్రీమ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అది అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు… 230 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్లోంది.. అదే వేగంతో ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు ప్రమాదానికి ముందు తీసుకున్నట్టుగా తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది ఈ ఘోర ప్రమాదం. మృతులంతా బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. అయితే ప్రమాదానికి ముందు ఇందులో ఉన్న వారంతా ఫేస్ బుక్ లో లైవ్ ప్రసారం చేశారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించగా…
రోహతాస్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అయిన 35 ఏళ్ల డాక్టర్ ఆనంద్ ప్రకాష్ కారును డ్రైవ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే వారు తమ కారు వేగం 300కు చేరుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కారు స్పీడో మీటర్‌ను ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేశారు. గంటకు 230 కి.మీ వేగం చేరినప్పుడు ఆనంద్ ప్రకాష్ వేగం కాస్త తగ్గించే ప్రయత్నం చేశాడు..అంతలో మరో వ్యక్తి బ్రేకులు కొట్టవద్దని చెబుతున్నాడు. డాక్టర్ ప్రకాష్ ప్రతి ఒక్కరూ తమ సీటు బెల్ట్‌లను పెట్టుకోవాలని కూడా కోరారు. ఖాళీ రోడ్డు కనిపించగానే 300 కిలోమీటర్ల వేగాన్ని చేరుతానని తన స్నేహితులకు భరోసా ఇచ్చారు. అంతలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ, ఆ కారు ఢీకొన్నాయి. వేగంగా ఢీకొట్టడంతో కారు ఇంజిన్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా కొంత దూరం ఎగిరిపడ్డారు..అక్కడికక్కడే మరణించారు. వారి శరీరాలు మాంసం ముద్దలయ్యాయి.
కాగా, ఆనంద్ ప్రకాష్‌తోపాటు మిగతా ముగ్గురు మృతులు బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన రియల్టర్ అఖిలేష్ సింగ్, ఇంజినీర్ దీపక్ కుమార్, వ్యాపారవేత్త ముఖేష్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా 30 ఏళ్ల వయస్కులని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత పారిపోయిన కంటైనర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అయితే ఆ కారు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న లైవ్ స్ట్రీమ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आज मरेंगे… और ये मर गए: स्पीड से खिलवाड़, जीवन पार!उत्तर प्रदेश में सुल्तानपुर के पास शुक्रवार को BMW और कंटेनर में टक्कर हुई.कार सवार चार लोगों की मौत हो गई. लाइव वीडियो किया गया था.मरने वालों में बिहार के तीन लोग थे. 60 से सीधे 230 स्पीड और सब खत्म. वीडियो- रंजन राजपूत pic.twitter.com/9x0kEQR3T3
— Prakash Kumar (@kumarprakash4u) October 15, 2022
పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యుపిఇఐడిఎ) అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని ఒక అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి