Vitamin Deficiency: ఆ విటమిన్ లోపం వల్ల మతిమరుపు వస్తుంది.. కంటి చూపు దెబ్బతింటుంది.. ఇక అన్నీ సమస్యలే..
ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యానికి అవి ఎంతో కీలక పాత్ర పోషించేవి విటమిన్లే. ఆహారం, సూర్యరశ్మి ద్వారా ఎన్నో విటమిన్లు మినరల్స్‌ను మనం పొందొచ్చు. అయితే, మతిమరుపు, కంటి చూపుకు కారణమైన విటమిన్ కూడా ఉంది.
ప్రతి పోషకం మనకు దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కానీ, విటమిన్లు లేకుండా మనిషి ఆరోగ్యం సాధ్యం కాదు.. ఎందుకంటే విటమిన్ల లోపం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. మనిషి పూర్తి ఆరోగ్యం, శరీర ఎదుగుదల, దృఢత్వానికి విటమిన్లు మినరల్స్ ఎంతో అవసరం. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యం, ఇతర సమస్యల నుండి మనల్ని కాపాడేవి విటమిన్లు, మినరల్స్. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యానికి అవి ఎంతో కీలక పాత్ర పోషించేవి విటమిన్లే. ఆహారం, సూర్యరశ్మి ద్వారా ఎన్నో విటమిన్లు మినరల్స్‌ను మనం పొందొచ్చు. అయితే, మతిమరుపు, కంటి చూపుకు కారణమైన విటమిన్ కూడా ఉంది. విటమిన్ బి12 చాలా ముఖ్యమైన పోషకం. దీనికి సంబంధించిన ఆహారాలను సరైన మొత్తంలో తీసుకోకపోతే అది చెడు పరిణామాలను కలిగిస్తుంది. తొందరగా అలసిపోవడం, ఆఫీసులో కునుకు తీయడం ఈ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది.మనం శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలంటే విటమిన్ బి12ను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పోషకం రెడ్ మీట్, చికెన్, చేపలు, గుడ్లతో సహా అనేక రకాల నాన్ వెజ్ ఫుడ్స్‌లో లభిస్తుంది. విటమిన్ బి 12 లోపంతో కలిగి ఆరోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి శరీరంలో అవసరమైన వివిధ విటమిన్లలో ముఖ్యమైంది విటమిన్ బి 12. కోబాలమిన్ గా కూడా దీన్ని పిలుస్తారు. విటమిన్ బి 12 మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మనిషి నాడీ వ్యవస్థ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి.
కంటి చూపు దెబ్బతింటుంది.. విటమిన్ బి.12లోపం మీ కళ్ళపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా చిన్న అక్షరాలు చదివేటప్పుడు కంటి చూపు లోపించటం, కంటి చూపు మసకరబారటం, కంటి నొప్పి అసలట వంటి సమస్యలు ఉండవచ్చు.
రక్తహీనత: విటమిన్ బి 12 లోపం ఉంటే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మందగిస్తుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
ఎముకల్లో నొప్పి.. తరచుగా ఎముకల్లో నొప్పిగా ఉంటే, శరీరంలో విటమిన్ బి12 లోపం ఉందని అర్థం చేసుకోవాలి. వీలైనంత త్వరగా అవసరమైన ఆహార పదార్థాలను తినడం ప్రారంభించండి. లేకపోతే వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి