AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPhone: ఛార్జర్ లేకుండా ఐఫోన్‌.. కంపెనీకి దిమ్మతిరిగే షాక్.. ఏకంగా రూ.165 కోట్ల ఫైన్..

ఛార్జర్‌లు లేకుండా ఐఫోన్‌లను విక్రయించడం ద్వారా ఆపిల్ వినియోగదారుల చట్టాన్ని ఉల్లంఘించిందని.. ఇలాంటి ఘటన బ్రెజిల్‌లో జరగడం మూడవసారని కోర్టు పేర్కొంది.

IPhone: ఛార్జర్ లేకుండా ఐఫోన్‌.. కంపెనీకి దిమ్మతిరిగే షాక్.. ఏకంగా రూ.165 కోట్ల ఫైన్..
Iphone
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 17, 2022 | 2:25 PM

ఛార్జర్లు లేకుండా లేటెస్ట్‌ ఐఫోన్‌ 14, 14 ప్రో ఫోన్లను అమ్మినందుకు యాపిల్ సంస్థకు బ్రెజిల్ కోర్టు 20 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. అంటే మన కరెన్సీలో అక్షరాల దాదాపు 165 కోట్ల రూపాయల జరిమానా అన్న మాట.. ఛార్జర్ లేకుండా ఐ ఫోన్ అమ్మి బలవంతంగా కస్టమర్లపై అదనపు భారం వేయడం దుర్వినియోగ విధానమంటూ బ్రెజిల్ కోర్టు మండిపడింది. బ్రెజిల్ వినియోగదారుల ఫోరమ్ దాఖలు చేసిన దావాపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐఫోన్ విక్రయాలను కూడా నిషేధిస్తున్నట్టు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. సావో పాలో రాష్ట్ర కోర్టు గురువారం ఈ తీర్పును వెలువరించింది. ఛార్జర్‌లు లేకుండా ఐఫోన్‌లను విక్రయించడం ద్వారా ఆపిల్ వినియోగదారుల చట్టాన్ని ఉల్లంఘించిందని.. ఇలాంటి ఘటన బ్రెజిల్‌లో జరగడం మూడవసారని పేర్కొంది. జనాదరణ లేని విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కంపెనీకి ఈ సందర్భంగా ఆదేశించింది.

కాగా.. ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగానే తాము కొత్త ఐ-ఫోన్‌లతో ఛార్జర్‌లను నిలిపివేసినట్టు యాపిల్ పేర్కొంది. బ్రెజిల్‌ కోర్టు తీర్పుపై పై కోర్టులో అప్పీల్‌కు వెళ్ళనున్నట్లు యాపిల్‌ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రోకాన్-ఎస్‌పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో కాపెజ్ మాట్లాడుతూ.. బ్రెజిల్‌లో పటిష్టమైన వినియోగదారుల రక్షణ చట్టాలు, సంస్థలు ఉన్నాయని యాపిల్ అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ చట్టాలను, వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

2024 చివరి నుంచి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలలో USB-C పోర్ట్‌లను సింగిల్ ఛార్జర్ ప్రమాణంగా ఉపయోగించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇందుకు అనుగుణంగా Apple తన ఫోన్ డిజైన్‌లను మార్చడానికి సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..