Big diwali sale: షాపింప్‌ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్‌ మరో ఛాన్స్‌.. బిగ్‌ దీపావళి సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌..

దీపావళి పండుగను క్యాష్‌ చేసుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ ఓ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీతో ఈ సేల్‌ పూర్తయింది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తీసుకొచ్చింది. బిగ్‌ దీపావళి సేల్‌ పేరుతో..

Big diwali sale: షాపింప్‌ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్‌ మరో ఛాన్స్‌.. బిగ్‌ దీపావళి సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌..
Big Diwali Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 18, 2022 | 6:25 AM

దీపావళి పండుగను క్యాష్‌ చేసుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ ఓ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీతో ఈ సేల్‌ పూర్తయింది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తీసుకొచ్చింది. బిగ్‌ దీపావళి సేల్‌ పేరుతో అక్టోబర్‌ 19 నుంచి 23వ తేదీ వరకు సేల్‌ను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ సేల్‌లో పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికి ఒక రోజు ముందు నుంచే (అక్టోబర్ 18) సేల్‌ అందుబాటులోకి వస్తుంది.

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నారు. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది.

ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు. రియల్‌మీ సీ33, పోకో సీ 31, ఒప్పో కే 10 ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందించనున్నారు. ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు, టీవీలు, వాషింగ్‌ మిషిన్లు, ఏసీలపై 75 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..