Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Poblems: ఈ 9 అలవాట్లు మీకున్నాయా..? కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీని సహాయంతో శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగించవచ్చు. కానీ మన ఆహారపు అలవాట్లు కాలేయంపై చెడు..

Kidney Poblems: ఈ 9 అలవాట్లు మీకున్నాయా..? కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
Kidney Poblems
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2022 | 2:02 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దీని సహాయంతో శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగించవచ్చు. కానీ మన ఆహారపు అలవాట్లు కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. దీని వల్ల కాలేయం దెబ్బతింటుంది. మీ అలవాట్లు కిడ్నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

  1. నొప్పి నివారణల మితిమీరిన మందుల వినియోగం: కీడ్నిల్లో నొప్పి కారణంగా చాలా మంది రకరకాల మందులను వాడుతుంటారు. మీరు వైద్యుడిని సంప్రదించకుండా ఎక్కువ నొప్పి నివారణ మందులు తీసుకుంటే అది మీ కిడ్నీలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే నొప్పి నివారణ మందులు తీసుకోవడం మానుకోండి. వైద్యుని సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.
  2. అధిక ఉప్పు తీసుకోవడం: ఉప్పు అధికంగా తీసుకోవడం ప్రమాదకరమేనంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలతో మీ ఆహారాన్ని చేర్చుకోవడం ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు.
  3. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం: ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోడియం, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇవి మీ కిడ్నీలకు చాలా హానికరం. ఇది కాకుండా అధిక భాస్వరం తీసుకోవడం మీ మూత్రపిండాలు, ఎముకలకు హానికరం.
  4. తగినంత నీరు తాగడం లేదు: కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి మంచి ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
  5. సరైన నిద్ర లేకపోవడం..: కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకుంటే ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉంది. రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
  6. ఎక్కువ మాంసాహారం తీసుకోవడం..: మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో అధిక మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్రపిండాలకు హానికరం. అలాగే అసిడోసిస్‌కు కారణమవుతుంది. అందుకే కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
  7. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు: చక్కెర స్థూలకాయానికి కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మీ కిడ్నీ పాడైపోవచ్చు.
  8. ధూమపానం: ధూమపానం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా, మీ మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అధిక మొత్తంలో ధూమపానం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
  9. మద్యం దుర్వినియోగం: మీరు రోజూ ఆల్కహాల్ తీసుకుంటే, మీ ఈ అలవాటును వదిలివేయండి. దీని వల్ల మీ కిడ్నీ పాడైపోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి