ఉమెన్స్‌ కాలేజీ గోడలు, గేటు ఎక్కుతూ పోకిరీలు హల్‌చల్‌.. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.. ఎక్కడంటే..

కాలేజీలోకి అబ్బాయిలు ప్రవేశిస్తున్నందున ఇది భద్రతా ఉల్లంఘనగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలు కాలేజీలోకి ప్రవేశించిన తర్వాత అనేక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. .

ఉమెన్స్‌ కాలేజీ గోడలు, గేటు ఎక్కుతూ పోకిరీలు హల్‌చల్‌.. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.. ఎక్కడంటే..
Delhi University
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 17, 2022 | 6:06 PM

ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ప్రతిష్టాత్మక మహిళా కాలేజ్‌ మిరాండా హౌస్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు గోడలు, గేటు దూకి లోనికి ప్రవేశించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. బయటి వ్యక్తులు అక్రమంగా హౌస్‌లోకి ప్రవేశించి..వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోను తాము సుమోటోగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వీడియో అక్టోబర్ 14 నాటిదని.. ఆ రోజు కాలేజీ క్యాంపస్‌లో దీపావళి పండుగను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ పండుగకు కేవలం బాలికలకు మాత్రమే అనుమతి ఉందని, అయితే ఈ విషయం తెలియగానే అబ్బాయిలు కాలేజీలోకి ప్రవేశించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మహిళా కళాశాల గేట్లు ఎక్కిన యువకుల వీడియో వైరల్ కావడంతో మిరాండా హౌస్‌లోని పలువురు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. అయితే, ఈ వీడియోలు ట్విట్టర్‌లో వైరల్ కావడంతో, పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్స్‌ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది.

మరోవైపు, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ట్విటర్‌లో వెళ్లి బాలికల భద్రతపై మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలోని మిరాండా కాలేజీలోకి అబ్బాయిలు ప్రవేశిస్తున్నందున ఇది భద్రతా ఉల్లంఘనగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలు కాలేజీలోకి ప్రవేశించిన తర్వాత అనేక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. .అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు, కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌కు నోటీసులు జారీ చేసినట్లు మలివాల్ తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, గోడ, గేటు ఎక్కిన నిందితులను గుర్తించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

అయితే, వైరల్‌ అవుతున్న వీడియోలలో యువకులు డియులోని రాంజాస్ కాలేజీకి చెందినవారని విద్యార్థులు ఆరోపించారు. పలు అసభ్యకర పదాలు, నినాదాలతో రాంజాస్ కాలేజీకి చెందిన యువకులు క్యాంపస్ చుట్టూ తిరుగుతున్న వీడియోలను షేర్ చేశారు. వీడియోల్లో యువకులు నినాదాలు చేశారు. లోపలికి అనుమతించమని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి