Watch Video: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో దారుణం.. ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
రైల్లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి జరిగిన సంఘటన మొత్తం వీడియో తీశాడు. వీడియోలో ఇరువురు ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని..
హౌరా- మాల్దా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం ఉద్రికత్తతకు దారితీసింది. ఒక వ్యక్తిని నడుస్తున్న రైల్లో నుండి బయటకు తోసేశాడు మరో వ్యక్తి. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగానే తిరితి తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడు ఆ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడని, అది కాస్తా ఘర్షణగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి జరిగిన సంఘటన మొత్తం వీడియో తీశాడు. వీడియోలో ఇరువురు ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని నడుస్తున్న రైలు నుండి బయటకు నెట్టారు. ఈ ఘటన తారాపీత్ రోడ్, రూంపూర్‌హాట్ స్టేషన్‌లో జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైలు ప్రసిద్ధ కాళీ దేవాలయం ఉన్న తారాపీఠ్‌కు చేరుకోవడంతో నిందితుడు ప్రశాంతంగా ప్రార్థనలు చేసి తన సీటులోకి వెళ్లిపోయాడు. వీడియోay వ్యక్తి రైలు దిగి ఘటనపై మురారై పోలీస్ స్టేషన్‌కు సమచారం అందించినట్టుగా పోలీసు వర్గాలు తెలిపారు. గాయపడిన ప్రయాణికుడిని సుంధీపూర్ ప్రాంతానికి చెందిన సజల్‌సేఖ్(25)గా గుర్తించినట్లు ఆర్‌పీఎఫ్ వర్గాలు తెలిపాయి. మల్లార్‌పూర్ స్టేషన్‌లో సజల్,నిందితుడికి మధ్య వాగ్వాదం మొదలైంది., ఆపై నిందితుడు అతన్ని నడుస్తున్న రైలు నుండి తోసేశాడని వారు వెల్లడించారు. తరువాత సజల్‌ను ట్రాక్‌ల దగ్గర ప్రాణాపాయ స్థితిలో రక్షించి రాంపూర్ హట్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
#MamataBanerjee #NarendraModi#AmitShah Howrah to malda intercity Express at yesterday 7:57 pic.twitter.com/hv64rfy6WS
— Sandeepkumar (@sandeeplahoti29) October 16, 2022
మరోవైపు, హౌరా-మాల్దా టౌన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నుండి బయటకు తోసివేయబడ్డ సజల్ షేక్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడినట్టుగా పోలీసులు తెలిపారు. అతడిని రాంపూర్‌హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందజేస్తున్నట్టుగా వివరించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారి తెలిపారు. సుండిపూర్ గ్రామానికి చెందిన షేక్, తాను సైంథియా నుంచి రైలు ఎక్కినట్లు పోలీసులకు చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి