అత్యాచారం ఆరోపణలపై ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన కేంద్రం..తక్షణ ఉత్తర్వులు అమలులోకి..
ముఖ్యంగా మహిళల గౌరవానికి సంబంధించిన సంఘటనలపట్ల కేంద్రం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ...సదరు అధికారిని తక్షణమే సస్పెప్షన్, అతనిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో మహిళపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జితేంద్ర నరైన్‌ను ప్రభుత్వం సోమవారం నుంచి వెంటనే సస్పెండ్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, తమ అధికారులు వారి స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రాహిత్య చర్యల పట్ల జీరో-టాలరెన్స్‌ను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మహిళల గౌరవానికి సంబంధించిన సంఘటనలకు సంబంధించి ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది. నరైన్ అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ఇతరులతో కలిసి ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అండమాన్ మరియు నికోబార్ పోలీసుల నుండి మంత్రిత్వ శాఖకు ఆదివారం ఒక నివేదిక అందినట్టు సమాచారం.
1990 బ్యాచ్‌కు చెందిన AGMUT కేడర్‌కు చెందిన IAS అయిన నరైన్‌పై అసభ్య ప్రవర్తన, పదవి దుర్వినియోగానికి పాల్పడినట్టుగా నివేదికలో వెల్లడించారు అండమాన్ నికోబార్ పోలీసులు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబంధిత అధికారిపై చట్ట ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీని ప్రకారం, నారాయణ్‌పై తక్షణమే సస్పెన్షన్ విధించబడింది. అతనిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్లు ప్రకటన పేర్కొంది.
Govt suspends with immediate effect senior IAS officer Jitendra Narain, accused of rape in Andaman and Nicobar Islands: MHA
— Press Trust of India (@PTI_News) October 17, 2022
ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. క్రిమినల్ కేసులో అండమాన్ మరియు నికోబార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం విడిగా చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి