NALCO Recruitment 2022: నెలకు రూ.లక్ష జీతంతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..

భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సాలోని అంగుల్‌లోనున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.. 19 సీఓఓ, సీఎఫ్‌ఓ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సివిల్‌ ఇంజినీర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NALCO Recruitment 2022: నెలకు రూ.లక్ష జీతంతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..
NALCO Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2022 | 7:47 AM

భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సాలోని అంగుల్‌లోనున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్.. 19 సీఓఓ, సీఎఫ్‌ఓ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సివిల్‌ ఇంజినీర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీఏ/ సీఎంఏ/ సీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల నుంచి 15 ఏళ్లపాటు అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 62 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 7, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Chief Coordinating Officer, NALCO Foundation, Nalco Bhavan, P-1, Nayapalli, Bhubaneswar- 751013, Odisha.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.