ICSI Recruitment 2022: బీటెక్‌/బీఎస్సీ అర్హతతో అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని గురుగాన్‌లోని సెంట్రల్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి..

ICSI Recruitment 2022: బీటెక్‌/బీఎస్సీ అర్హతతో అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
ICSI New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2022 | 7:36 AM

భారత ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని గురుగాన్‌లోని సెంట్రల్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఐసీఎస్‌ఐలో ఇప్పటికే సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి 31 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.33,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పని ప్రదేశం: Central Registration Centre, Corporate Bhawan, IICA, Manesar, Haryana.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.