Hing with Hot Water: శీతాకాలంలో గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలు ఎన్నో..

Hing with Hot Water: భార‌తీయుల వంట ఇంటిలోని పోపుల పెట్టెలో ఉండే పదార్ధాల్లో ఒకటి ఇంగువ. దీనిని వివిధ రకాల ఆహార వంట‌ల్లో రుచి, వాసన అందిస్తుందని ఉప‌యోగిస్తుంటారు. ఇంగువను కూర,...

Hing with Hot Water: శీతాకాలంలో గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలు ఎన్నో..
Hing Water
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 8:39 PM

Hing with Hot Water: భార‌తీయుల వంట ఇంటిలోని పోపుల పెట్టెలో ఉండే పదార్ధాల్లో ఒకటి ఇంగువ. దీనిని వివిధ రకాల ఆహార వంట‌ల్లో రుచి, వాసన అందిస్తుందని ఉప‌యోగిస్తుంటారు. ఇంగువను కూర, సాంబార్, పచ్చళ్ళు వంటి వాటికీ పోపుల పెట్టె సమయంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఇంగువ తినే ఆహారపదార్ధాలు అదనపు రుచిని అందించడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది.  ముఖ్యంగా వేడి నీటిలో ఇంగువను కలిపి రోజూ తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఈ ఇంగువ నీరు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. ఈరోజు హాట్ వాట‌ర్‌లో చిటికెడు ఇంగువ క‌లిపి తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*రోజూ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసుకుని తాగితే.. కంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంగువ‌లో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు కళ్ళు పొడిబారకుండా చేస్తుంది.

* మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పికి మంచి నివారిణిగా ఈ వాటర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

* ఇంగువని వేడి నీటీతో కలిపి రోజూ తాగితే.. మానసిక ఒత్తిడి, డిప్రెష‌న్, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లకు చెక్ పెడుతుంది.

*షుగర్ వ్యాధి గ్రస్తులకు చక్కటి ఔషధం ఇంగువ. ప్ర‌తి రోజు వేడి నీటిలో ఇంగువు క‌లిపి తీసుకుంటే.. ర‌క్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

*ఈ హింగ్ వాటర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

*ఇంగువ జీర్ణ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. గ్యాస్‌, క‌డుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్యల‌కు చక్కటి ఔషధం ఈ ఇంగువ హాట్ వాటర్.

*ఎవరికైనా చలికాలంలో జలుబు త్వరగా చేస్తుంది. అయితే ఈ హింగ్ వాటర్ శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు జలుబు బారిన పడకుండా చేస్తుంది.

*ఇంగువును హాట్ వాట‌ర్ క‌లిపి భోజ‌నం త‌ర్వాత తీసుకుంటే.. జీర్ణ స‌మ‌స్య కూడా దూరం అవుతాయి.ఇ

*మూత్రాశయం , మూత్రపిండాల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలు బ‌య‌ట‌కు పోయేలా చేస్తుంది.

Also Read:  డెల్టాకంటే 4 రేట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి.. రోగనిరోధక శక్తిని తట్టుకుని మరీ విజృభిస్తుందంటున్న ప్రొఫెసర్..