AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Diseases: అలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువేనట.. అధ్యయనంలో కీలక విషయాలు..!

Heart Diseases: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మన జీవన శైలి, తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శాఖాహారులతో..

Heart Diseases: అలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువేనట.. అధ్యయనంలో కీలక విషయాలు..!
Subhash Goud
| Edited By: |

Updated on: Dec 10, 2021 | 6:53 AM

Share

Heart Diseases: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మన జీవన శైలి, తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శాఖాహారులతో పోలిస్తే మాంసాహారం తీసుకునేవారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువ అని మరో పరిశోధన వెల్లడించింది. అయితే ఇటీవల బ్రిటన్‌లో గుండెజబ్బుల బారిన పడిన 4,20,000 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాజా అధ్యయనం చేశారు. శాఖాహారులు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. గ్లాస్గో విశ్వవిద్యాలయానికి (University of Glasgow) చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనాన్ని యూరోపియన్ హార్ట్ జర్నల్‌ లో ప్రచురించారు. పెస్కటేరియన్ డైట్‌ను ప్రోత్సహించడం వల్ల గుండెజబ్బుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. శాకాహారులు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం తినేవారు గుండె జబ్బుల బారిన పడే లేదా చనిపోయే ప్రమాదం ఎంతవరకు ఉందనే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. దీనికి సంబంధించిన డేటాను యూకే బయోబ్యాంక్ నుంచి సేకరించారు.

మాంసం ఎక్కువ తినేవారిలో ఈ జబ్బులు ఎక్కువే..

ఇతరులతో పోలిస్తే మాంసం ఎక్కువగా తినేవారిలో 94.7 శాతం మంది ఊబకాయం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మాంసం ఎక్కువగా తినేవారితో పోలిస్తే చేపలను మాత్రమే ఆహారంలో భాగం చేసుకునేవారు హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఇతర గుండె సంబంధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువని వారు చెబుతున్నారు. చేపల్లో ఒమెగా 3 ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ ఉన్న వారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు పండ్లు, కూరగాయలు, ఫైబర్, మంచి కొవ్వులు, నీరు అధికంగా లభించే పదార్థాలకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు.

శాఖాహారులకు గుండె జబ్బులు తక్కువ..

శాఖాహారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, వీరు మాంసంకంటే హానికరమైన ఫాస్ట్‌ఫుడ్, స్మూతీ డ్రింక్స్, పిజ్జాలు.. వంటివి తింటున్నారని గుర్తించారు. కేవలం మాంసాహారం మానేసి, హానికరమైన ఇతర పదార్థాలను తీసుకుంటే అనారోగ్యాల ప్రభావం ఏమాత్రం తగ్గదని వారు చెబుతున్నారు. చేపలను మాత్రమే తినేవారు ఈ రెండు గ్రూపులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. వీరు ఇంట్లో చేసుకున్న వంటలు తినడానికి ఆసక్తి చూపుతున్నారట.

మాంసానికి బదులు చేపలు తింటే..

మాంసాహారానికి బదులుగా పెస్కటేరియన్ డైట్ (మాంసానికి బదులుగా కేవలం చేపలు మాత్రమే తినేవారు)ను ప్రోత్సహించాలని గ్లాస్గో యూనివర్సిటీ ప్రొఫెసర్, అధ్యయన బృంద సభ్యుడు జిల్ పెల్ చెబుతున్నారు. పెస్కటేరియన్ డైట్‌ను ఫాలోఅయ్యేవారు గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువని తమ పరిశోధనలు తేల్చాయని ఆయన చెప్పారు. మాంసం వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. చేపలు ఎక్కువగా తినేవారికి పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి గుండెజబ్బులను సమర్థంగా ఎదుర్కోగలవని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Fish Eating

ఇవి కూడా చదవండి:

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?

Before Sleeping: నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే!