AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?

Forgetfulness: మతిమరుపు అనేది చాలా మందిలో ఉంటుంది. ఒత్తిడి, టెన్షన్‌ తదితర కారణాల వల్ల చాలా మందికి మతిమరుపు ఉంటుంది. కొందరికి టెన్షన్‌.. పని ఒత్తిడి.. ఎక్కువగా..

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 09, 2021 | 6:20 AM

Share

Forgetfulness: మతిమరుపు అనేది చాలా మందిలో ఉంటుంది. ఒత్తిడి, టెన్షన్‌ తదితర కారణాల వల్ల చాలా మందికి మతిమరుపు ఉంటుంది. కొందరికి టెన్షన్‌.. పని ఒత్తిడి.. ఎక్కువగా ఆలోచించడం వల్ల మతి మరుపు వస్తుంటుంది. అయితే మతిమరుపు ఉన్నవారు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ప్రతి రోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్‌ వయసుతో పాటు వచ్చే మతి మరపును కూడా దూరం చేస్తాయని పరిశోధనల్లో తేలింది. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌ లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. పాలకూరలో లభించే విటమిన్‌ సి, విటమిన్ ఏ లు మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్‌, ఫాస్ఫరస్‌, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ తదితరాలుంటాయి.

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్త హీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది.

సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. పాలకూరను వెజిటబుల్‌ సూప్‌ లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌ తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతి రోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సరైన నిద్ర ఉండాల్సిందే..

మతి మరుపు పోగొట్టాలంటే ప్రతి రోజు సరిపడినంత నిద్రపోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే సమయం తగ్గిన కొద్దీ మన జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందట. అలాగే రోజు తప్పనిసరిగా ఓ అరగంట పాటు ఏదైనా ఎక్స్ సైజ్ చేయాలని సూచిస్తున్నారు. దీని వలన ఆక్సిజన్ సక్రమంగా అందటంతో పాటుమెదడు ఏక్టివ్‌గా ఉంటుంది అంటున్నారు.

Spinach

ఇవి కూడా చదవండి:

Platelet Count: ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయాయా..? ప్రమాదం ఏమిటి..? పెరగాలంటే ఏం చేయాలి..!

Crying Benefits: నవ్వు ఎంత ముఖ్యమో.. ఏడుపు కూడా అంతే ముఖ్యం.. ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలా..?