Jaggery peanut chikki: చలికాలంలో పల్లి పట్టీలు తింటున్నారా?.. ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..!

Jaggery peanut chikki: అసలే శీతాకాలం. తీవ్రమైన చలి ప్రతీ ఒక్కరిని వేధిస్తుంటుంది. అయితే, చలిని తట్టుకునేందుకు మన భారతీయ ఆహారపదార్థాల్లో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉంటాయి.

Jaggery peanut chikki: చలికాలంలో పల్లి పట్టీలు తింటున్నారా?.. ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..!
Chikki
Follow us

|

Updated on: Dec 09, 2021 | 11:20 AM

Jaggery peanut chikki: అసలే శీతాకాలం. తీవ్రమైన చలి ప్రతీ ఒక్కరిని వేధిస్తుంటుంది. అయితే, చలిని తట్టుకునేందుకు మన భారతీయ ఆహారపదార్థాల్లో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పల్లి పట్టిలు. బెల్లం, వేరుశెనగ చిక్కీ. శీతాకాలంలో ఇది తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం-శెనక చిక్కి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా.. శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ హెల్తీ చిక్కీని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

కావలసినవి: బెల్లం-వేరు శెనగ చిక్కీ తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం, 250 గ్రాముల పొట్టు తీసిన వేరుశెనగ, 200 గ్రాముల బెల్లం, అర కప్పు నీరు, తగినంత వెన్న అవసరం.

తయారీ విధానం: పల్లి పట్టీ(బెల్లం-వేరు శెనగ చిక్కీ) తయారు చేయడానికి ముందుగా పాన్ వేడి చేయాలి. ఆ తరువాత వేరుశెనగలను బాగా వేయించాలి. తద్వారా అవి క్రిస్పీగా మారుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసి బెల్లం వేసి గ్యాస్‌పై ఉడికించాలి. బెల్లం పాకంలో వేరుశెనగ వేసి బాగా కలపాలి. ఆ తరువాత నెయ్యి, వెన్నతో మిక్స్ చేసి.. కావాల్సిన ఆకృతిలో మార్చుకోవాలి. కావాలనుకుంటే.. డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇంకేముంది బెల్లం చిక్కీ రెడీ. ఈ చిక్కీలను భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు తినొచ్చు. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో రక్త హీనత తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Also read:

జిమ్‌లో పిల్లి వర్క్‌ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో

Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..

Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో