Winter Skin Care Tips: చలికాలంలో పెదవులు పగులుతుంటే ఇలా చేయండి.. అవెంటంటే..
చలికాలంలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో వాతావరణంలో తేమ కారణంగా గాలి పొడిగా మారుతుంది.
చలికాలంలో చర్మ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో వాతావరణంలో తేమ కారణంగా గాలి పొడిగా మారుతుంది. దీంతో చర్మం, పెదవులు పొడిగా మారుతుంటాయి. చలికాలంలో చర్మం పొడిబారడం.. దద్దుర్లు.. అలెర్జీలు.. దురద వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మరీ ముఖ్యంగా శీతాకాలంలో పెదవులు పగలడం ప్రారంభమైతుంది. అలాగే కాళ్ల మడమలు.. పెదవులు విపరీతంగా వేదిస్తుంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మార్కెట్లో లభించే అనేక కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వలన ఈ సమస్యలు తగ్గించడం కష్టమే.
కొన్ని సందర్బాల్లో పెదవులు విపరీతంగా పగిలి రక్తం కూడా రావడం జరుగుతుంటుంది. దీంతో ఏదైనా తినడం, తాగడం వంటి చాలా కష్టంగా మారుతుంది. అయితే చలికాలంలో అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు పెదవులకు లిప్ బామ్, లోషన్ మొదలైనవి అప్లై చేస్తారు. అయితే ఇవి సమస్యను మరింత తీవ్రం చేస్తుంటాయి. ఇలా కాకుండా ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో పెదవులు పగలడం సమస్యను తగ్గించుకోవచ్చు.
1. చలికాలంలో నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. దీంతో శరీరం పొడిబారడం, పెదవులు పగిలిపోయే సమస్య తగ్గుతుంది. 2. ఆవనూనె రోజూ రాత్రిళ్లు నాభి వద్ద రాయాలి. దీంతో పెదవులు పగిలే సమస్య తగ్గుతుంది. 3. జూ రాత్రి పడుకునేటప్పుడు పచ్చిమిర్చి టర్మరిక్ మిక్స్ క్రీమ్ రాసుకుంటే పెదవుల పగిలిపోయే సమస్య తగ్గుతుంది. క్రీమ్ లేదా దేశీ నెయ్యిని తీసుకొని తేలికపాటి చేతులతో పెదాలను మసాజ్ చేయవచ్చు. 4. రోజూ రాత్రి పడుకునేటప్పుడు పెదవులపై వాసెలిన్ రాసుకుంటే పగిలిన పెదవులు నయమవుతాయి. దీనితో పాటు నలుపు కూడా పోతుంది. 5. పెదవులు పొడిగా ఉన్నప్పుడు నాలుకతో తడి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత పెరుగుతుంది. 6. ధూమపానం తాగేవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. 7. పెదవులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.