Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. 19 మందితో మొదలైన గేమ్‏లో ఇప్పుడు సన్నీ, శ్రీరామచంద్ర, మానస్, కాజల్, సిరి, షణ్ముఖ్

Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 09, 2021 | 7:45 AM

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. 19 మందితో మొదలైన గేమ్‏లో ఇప్పుడు సన్నీ, శ్రీరామచంద్ర, మానస్, కాజల్, సిరి, షణ్ముఖ్ మాత్రమే మిగిలారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో సిరిని ఇష్టానుసారంగా మాటలు అనేశాడు షణ్ముఖ్.. ఈ విషయంపై మానస్, కాజల్ చర్చించుకున్నారు. సిరిని.. షణ్ముఖ్ ప్రతి విషయంలో కంట్రోల్ చేస్తున్నాడనిపిస్తుందని మానస్ చెప్పగా.. చూపులతోనే కంట్రోల్ చేస్తున్నాడని బదులిచ్చింది కాజల్. సిరి ఇండివిడ్యువాలిటీ కోల్పోతుంది అని మానస్ అనగా.. ఇంట్లో ఉండడానికే అలా చేస్తుందని చెప్పుకొచ్చింది కాజల్.

ఇక ఆ తర్వాత.. సిరి, షణ్ముఖ్, జెస్సీ, శ్రీరామచంద్ర మధ్య జరిగిన గొడవను రీక్రియేట్ చేయాలని చెప్పగా.. సన్నీ షణ్ముఖ్‏ను ఇమిటేట్ చేశాడు. దీంతో షణ్ముఖ్ సీరియస్ అయ్యాడు. వెకిలి కామెడీ చేయకు.. నాకు నచ్చదు అంటూ మరోసారి ఫైర్ అయ్యాడు. దీంతో సన్నీ రియాక్ట్ అవుతూ.. నేను ఇమిటేట్ చేయట్లేదు.. రీ క్రియేషన్ అంటే ఇలాగే ఉంటుంది అని బదులిచ్చాడు. ఇమిటేట్ చేస్తే నాకు నచ్చదు అని చెప్తున్నా.. నువ్ చేయాలని ఫిక్స్ అయ్యావు కదా.. నేను నాకు నచ్చినట్టే ఉంటా అని షణ్ముఖ్ అనడంతో సన్నీ మరింత సీరియస్ అయ్యాడు. మొత్తానికి సన్నీ, షణ్ముఖ్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవే జరిగింది.

ఇక షణ్ముఖ్‏ను కూల్ చేయడానికి వచ్చిన సిరి పై మరోసారి ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. నువ్వు కూడా నన్ను తక్కువ చేస్తున్నావంటూ అసహనానికి లోనయ్యాడు. ఆ తర్వాత సిరి వచ్చి సారీ చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. నావల్ల నీకేం నెగిటివి లేదు.. నీ మంచి కోసం నేను మాట్లాడితే నేను నెగిటివ్ అవుతున్నాను అంటూ అరిచేశాడు. ఇక్కడి నుంచి వెళ్లిపో.. మిగతా ఇంటి సభ్యుల మాదిరిగానే ఇకపై నువ్వు కూడా.. వేరేవాళ్లను ఆయన అంటావు.. నన్ను అరేయ్, వెళ్లు బే అంటావు..అంత చనువు ఇచ్చాను నీకు.. నిన్ను ఎవరైన అంటే ఆపుతాను.. అవతలవాడి ముందు నీకోసం తక్కువైనా పర్లేదు అని నేను అనుకుంటే.. మీ మమ్మీకి ఇవన్నీ గుర్తులేవు..హాగ్ ఒక్కటే గుర్తు ఉంది అంటూ రెచ్చిపోయాడు షణ్ముఖ్.. దీంతో సిరి ఎదురుచెప్పలేకపోయింది. మొత్తానికి సిరి తల్లి వచ్చి ఒకేసారి అన్న మాటను వీరిద్దరు ప్రతిసారి గుర్తుచేస్తూ.. ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ సిరి తల్లి మాటలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో సర్‏ప్రైజ్.. ఆకట్టుకుంటున్న సోచ్ లియా సాంగ్..

Simbu: మెగా ప్రొడ్యూసర్‌ చేతికి మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు !.. మెగా హీరోలతోనే తెరకెక్కించే ఛాన్స్‌!