Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో సర్‏ప్రైజ్.. ఆకట్టుకుంటున్న సోచ్ లియా సాంగ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..?

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో సర్‏ప్రైజ్.. ఆకట్టుకుంటున్న సోచ్ లియా సాంగ్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 09, 2021 | 6:52 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయేసరికి నెట్టింట్లో రచ్చ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో రాధేశ్యామ్ నుంచి ఎప్పటికప్పుడు సర్‏ప్రైజింగ్ అప్డేట్స్ ఇస్తూ ఖుషి చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సోచ్ లియా సాంగ్ విడుదలైంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఆషికి 2, కబీర్ సింగ్ సినిమాకు మ్యాజిక్ చేసిన మిథున్, అర్జీత్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇటీవల విడుదలైన ఆషికి ఆ గయీ పాట ఇన్స్టెంట్ హిట్ అయిందో ఇప్పుడు ఈ పాట కూడా అలాగే అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Simbu: మెగా ప్రొడ్యూసర్‌ చేతికి మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు !.. మెగా హీరోలతోనే తెరకెక్కించే ఛాన్స్‌!

Shraddha Kapoor: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సాహో బ్యూటీ!.. హింట్‌ ఇచ్చిన ప్రముఖ నటి..