Shraddha Kapoor: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సాహో బ్యూటీ!.. హింట్‌ ఇచ్చిన ప్రముఖ నటి..

మొన్న రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, నిన్న అనుష్క రంజన్- ఆదిత్య సీల్, నేడు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. ఇలా బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. హిందీ పరిశ్రమకు చెందిన తారలు ఒక్కొక్కరు తమ జీవిత భాగస్వామితో కలిసి ఏడుడుగులు నడుస్తున్నారు

Shraddha Kapoor: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సాహో బ్యూటీ!.. హింట్‌ ఇచ్చిన ప్రముఖ నటి..
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2021 | 9:32 PM

మొన్న రాజ్ కుమార్ రావ్- పత్రలేఖ, నిన్న అనుష్క రంజన్- ఆదిత్య సీల్, నేడు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. ఇలా బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. హిందీ పరిశ్రమకు చెందిన తారలు ఒక్కొక్కరు తమ జీవిత భాగస్వామితో కలిసి ఏడుడుగులు నడుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ చేరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ‘సాహో’తో తెలుగు సినీ ప్రియులను కూడా ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్‌. శక్తి కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ‘ఆషికీ-2’ , ‘భాఘి’ సిరీస్‌, ‘ఏక్ విలన్’, ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘హైదర్‌’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’, ‘చిచ్చోరే’ తదితర హిట్‌ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

కాగా ‘సాహో’తో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన శ్రద్ధ గత కొంత కాలంగా రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో జంటగా హాజరవ్వడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా శ్రద్ధా కపూర్ వివాహాంపై అలనాటి నటి, ఆమె మేనత్త పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. దీంతో కత్రినా లాగే త్వరలోనే ఆమె కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్‌ చేసుకుంది. దీనికి స్పందించిన పద్మిని ‘ నీ పెళ్లిలో కూడా ఈ పాటనే పాడుతాను’ అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకొబోతుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Also Read:

Pushpa: టీమ్ మెంబర్ వర్క్ ఫిదా అయిన ఐకాన్ స్టార్.. ఏకంగా 12 మందికి గిఫ్ట్స్ గా..

Kriti Kharbanda: నవ్వే నవమల్లికా ఈ ముద్దుగుమ్మ.. కృతి కర్బంద అందమైన ఫోటోలు..

RRR movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. బందోబస్త్‌ కావాలంటోన్న థియేటర్ల ఓనర్లు..