Pushpa: టీమ్ మెంబర్ వర్క్ ఫిదా అయిన ఐకాన్ స్టార్.. ఏకంగా 12 మందికి గిఫ్ట్స్ గా..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Dec 08, 2021 | 9:01 PM

పుష్ప.. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు బన్నీ అభిమానులు.

Pushpa:  టీమ్ మెంబర్ వర్క్ ఫిదా అయిన ఐకాన్ స్టార్.. ఏకంగా 12 మందికి గిఫ్ట్స్ గా..
Bunny

Pushpa: పుష్ప.. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు బన్నీ అభిమానులు. ఇక రంగస్థలం సినిమాతర్వాత సుకుమార్, అల వైకుంఠపురం తర్వాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత గ్రాండ్‌గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉంటే బన్నీ తన టీమ్ మెంబర్స్ వర్క్ కి ఫిదా అయి ఏకంగా 12 మంది టీమ్ మెంబర్స్ కి గోల్డ్ రింగ్స్  గిఫ్ట్ గా ఇచ్చాడట. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ఐటమ్ నెంబర్ పూర్తి కాలేదు. `పుష్ప` టీమ్ సమంత బన్నీలపై ఐటమ్ సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో పూర్తి చేసింది. సాంగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడంతో టీమ్ మెంబర్స్ కష్టానికి బన్నీ ఫిదా అయ్యాడట.. బన్నీ టీమ్ మెంబర్స్ని ప్రత్యేకంగా అభినందిస్తూ .. 12 మంది టీమ్ మెంబర్స్కి గోల్డ్ రింగ్స్ ని బహుమతిగా ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గామారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu