క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

క్యూట్‏నెస్ ఓవర్ లోడ్‏తో నెటిజన్లను కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది.

Rajitha Chanti

|

Dec 08, 2021 | 2:09 PM

స్టార్ హీరోహీరోయిన్స్‏కు తమ అభిమానులను దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది సోషల్ మీడియా. తమ ఫేవరేట్ నటీనటుల గురించి తెలుసుకునేందుకు.. వారి సినిమా అప్డేట్స్ ఫాలో కావడానికి ఇంటర్నెట్ ఎక్కువగా సహాయపడుతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా పలువురు నటీనటులు తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ.. చిన్నప్పటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఒక్కటేమిటి అన్ని భాషలకు సంబంధించిన హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తన ఓ చిన్నారి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Actress 1

పైన ఫోటోలో క్యూట్‏నెస్ ఓవర్ లోడ్‏తో నెటిజన్లను కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. మోడల్‏గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?

Actress 3

టాలీవుడ్… బాలీవుడ్‏లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ కుర్రకారును అట్రాక్ట్ చేస్తుంది. స్టార్ హీరోయిన్‏గా మారిన ఈ చిన్నారికి ఇప్పుడు యూత్‏లో యమ ఫాలోయింగ్ ఉంది. గుర్తుపట్టండి.

00

ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్‏లో అత్యథిక చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే తెలుగులోనూ సూపర్ హిట సినిమా చేసి టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. అందుకే ఈ చిన్నారిని తెలుగు ప్రేక్షకులంతా ముద్దుగా మల్లీశ్వరి అని పిలుచుకుంటారు. గుర్తుపట్టారా ? ఆమెవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్.

Katrina Kaife

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. తన ప్రియుడి విక్కీ కౌశల్‏ను డిసెంబర్ 10న వివాహం చేసుకోబోతుంది కత్రీనా.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కత్రీనా కైఫ్ పెళ్లి గురించిన వార్తలు హల్‏చల్ చేస్తున్నాయి. వెడ్డింగ్ కార్డ్ నుంచి పెళ్లి భోజనాలు.. ఫెళ్లిలో నియమ నిబంధనలు.. అతిథుల రాక.. ఇలా ఒక్కటేమిటి ప్రతి చిన్న విషయం పై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రాజస్థాన్‏లోని సవాయ్ మాధోపూర్‏లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరిద్దరి పెళ్లితంతు జరగనుంది.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

ఇక వీరి వివాహానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కబీర్ ఖాన్, మినీ మాథుర్, ఫరా ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్.. కరణ్ జోహార్, అలియా భట్, అల్విరా అగ్ని హెత్రి, అర్పితా ఖాన్ శర్మ, అలీ అబ్బాస్ జాఫర్, శశాంక్ ఖైతాన్, రోహిత్ వంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్ ధావన్, నటాషా దలాల్, నేహా ధూపియా తదితరులు విచ్చేయనున్నారు.

Also Read: Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్

Alia Bhatt: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. ఆర్ఆర్ఆర్ నుంచి మేకింగ్ వీడియో..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu