Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్
Samantha

నాగచైతన్య...సమంత విడాకుల ప్రకటన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్

Rajitha Chanti

|

Dec 08, 2021 | 12:44 PM

నాగచైతన్య…సమంత విడాకుల ప్రకటన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటూ పేరు తెచ్చుకున్న ఈ జంట ఇలా ఆకస్మాత్తుగా విడిపోవడం ఏంటని అభిమానులతోపాటు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. అయితే వీరిద్దరి విడాకుల ప్రకటన అనంతరం సమంత పై పూర్తిగా నెగిటివిటి వ్యాప్తి చెందింది. తన వ్యవహార శైలి నచ్చకపోవడం వలనే చైతూ విడాకులు ఇచ్చారంటూ కొందరు నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్ చేశారు. అలాగే సమంత మీద నానా రకాలుగా రూమర్స్ వచ్చాయి. ఇక మరికొందరు సమంత అబార్షన్ చేయించుకుందని కూడా కామెంట్స్ చేశారు. అయితే గతంలోనే తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది సమంత.

తన జీవితంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరింది. అయితే తాజాగా మరోసారి సమంత విడాకుల అంశంపై స్పందించింది. విడాకులు తీసుకున్న తర్వాత తాను చనిపోతానని అనుకున్నాని.. కానీ సమస్యలను ఎదుర్కోంటు బలంగా ఉన్నానని.. ఇప్పుడు ఇలా ఉన్నానంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది సామ్. అలాగే తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో క్లిష్టంగా గడిచిందని తెలిపింది. దీంతో తనకు భవిష్యత్తుపై ఆశలు లేవని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఛానల్‏కు బాలీవుడ్ నటీనటులతో కలిసి చిట్ చాట్ లో పాల్గోంది. ఈ సందర్భంగా విడాకుల అనంతరం తన పై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించారు సమంత.

సమంత మాట్లాడుతూ… “ఎన్నో సంవత్సరాలు కష్టపడి నా కెరీర్ నిర్మించుకున్నాను.. కానీ 2021లో నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందుల కారణంగా నా కలలన్నీ శిథిలమైపోయాయి. నేనెంతో కృంగిపోయాను. ఇక సోషల్ మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు చేరువ చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ నుంచి ప్రేమమాభిమానాలు పొందుతున్నాను.. ప్రస్తుతం వాళ్లు నా జీవితంలో భాగమయ్యారు. కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వారందర్నీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది” అంటూ సామ్ తెలిపారు. ఈ ఏడాది నా కలలన్ని శిథిలమైపోయాయి. అందుకే వచ్చే ఏడాదిపై ఆశలు పెట్టుకోలేదు. కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తాను అంటూ చెప్పుకొచ్చింది సమంత.

Also Read: Alia Bhatt: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. ఆర్ఆర్ఆర్ నుంచి మేకింగ్ వీడియో..

Vijay Sethupati: విజయ్ సేతుపతి పై క్రిమినల్ కేసు.. ఎయిర్ పోర్టు ఘటనలో హీరోకు బిగుస్తున్న ఉచ్చు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu