Lobo: మెగాస్టార్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్న లోబో!.. ఏ సినిమాలో అంటే..

లోబో.. తెలుగు సినిమా ప్రేక్షకులకు, అందులోనూ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. వినూత్న వేషధారణతో పాటు సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటూ చాలామందిని అతను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పక్కా హైదరాబాదీ యాసతో పలువురి అభిమానం సంపాదించాడు

Lobo: మెగాస్టార్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్న లోబో!.. ఏ సినిమాలో అంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2021 | 9:40 PM

లోబో.. తెలుగు సినిమా ప్రేక్షకులకు, అందులోనూ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. వినూత్న వేషధారణతో పాటు సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటూ చాలామందిని అతను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పక్కా హైదరాబాదీ యాసతో పలువురి అభిమానం సంపాదించాడు. గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లోబో కొన్ని మ్యూజిక్‌ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించాడు. ఇటీవల బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా సందడి చేశాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. కాగా బిగ్‌బాస్‌ షోతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న లోబోకు ఓ బంఫర్‌ ఆఫర్‌ వచ్చిందని సమాచారం. ఓ స్టార్‌ హీరోతో కలిసి నటించే అవకశాన్ని దక్కించుకున్నాడని టాక్‌. ఆయనెవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి.

ఇటీల ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరుసార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతో పాటు ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అంటే మెగాస్టార్‌- మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘భోళా శంకర్‌’లోనే లోబో నటించనున్నాడని అర్థం చేసుకోవచ్చు. తమిళ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా కనిపించనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

Also Read:

Shraddha Kapoor: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సాహో బ్యూటీ!.. హింట్‌ ఇచ్చిన ప్రముఖ నటి..

Kriti Kharbanda: నవ్వే నవమల్లికా ఈ ముద్దుగుమ్మ.. కృతి కర్బంద అందమైన ఫోటోలు..

RRR movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. బందోబస్త్‌ కావాలంటోన్న థియేటర్ల ఓనర్లు..