రంజాన్ మాసంలో ఇఫ్తార్ స్పెషల్.. టేస్టీ టేస్టీ గంజి ..! తయారీ విధానం.. స్పెషలేంటంటే..

రంజాన్‌ మాసంలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్‌ అని పిలువబడే ప్రార్థన, భోజనంతో వారంతా ఉపవాసం విరమిస్తారు. ఖర్జూరం, నీరు లేదంటే పాలతో ఉపవాసాన్ని విరమిస్తారు. ఖర్జూరం, నీరు తీసుకున్నాక భోజనం చేస్తారు. రంజాన్‌ మాసమంతా ఉపవాసం తరువాత..

రంజాన్ మాసంలో ఇఫ్తార్ స్పెషల్.. టేస్టీ టేస్టీ గంజి ..! తయారీ విధానం.. స్పెషలేంటంటే..
Iftar Special Ganji
Follow us

|

Updated on: Apr 07, 2024 | 8:31 AM

రంజాన్‌…ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లీంలు నెలరోజులపాటు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. ఈ పండున నేపథ్యంలో నెలరోజులపాటు రోజా ఉంటారు. రోజా అంటే ఉపవాసం అని అర్థం. రంజాన్ మాసంలో తప్పక రోజా, ఆరాధన, ప్రార్థన,ఖురాన్‌ పఠించటం వంటివి చేయాలని వారు బలంగా విశ్వసిస్తారు. ఈ రంజాన్‌ సమయంలో ఎక్కువ సమయం మసీదులో గడపాలని, మసీదులోనే ప్రార్థనలు చేయాలని మతపెద్దలు చెబుతుంటారు.రంజాన్‌ మాసంలో అతి ముఖ్యమైనది ఉపవాసం.ఉపవాసం అనంతరం వారు ప్రత్యేకించి గంజిని ఆహారంగా తీసుకుంటారు. రంజాన్ నెలలోనే తయారుచేసే ఈ గంజికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలా ప్రాంతాల్లో ఇఫ్తార్ సమయంలో పండ్లు, అల్పాహారం లేకపోయినా.. ఒక గిన్నె గంజి అయినా తప్పక తాగాలని చెబుతుంటారు.సాయంత్రం అసర్ సమాజ్ అయిన తరువాత మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తారు.చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ గంజిని తీసుకుని తాగుతారు. ఇంతకీ ఈ గంజిని ఎలా తయారు చేస్తారు. దాని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రంజాన్‌ ఉపవాస వేళ ప్రత్యేకమైన గంజి..

బియ్యం రవ్వ లేదంటే, బొంబాయి రవ్వను ఉపయోగించి ఈ గంజి తయారు చేస్తారు. ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లంవెల్లుల్లి ముద్ద, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, యాలాకులు, దాల్చినచెక్క, లవంగాలు, నెయ్యి, కొందరు ఇందులో పల్లీలను కూడా వాడుతుంటారు. ముందుగా మసాలా దినుసులన్నింటినీ నెయ్యిలో వేయిస్తారు. ఒక పెద్ద వంట పాత్రలో నీళ్లు పోసి బాగా మరగనిస్తారు. నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వను కలుపుతారు. అలాగే, ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, సరిపడ్డ ఉప్పు వేసి బాగా గంజి చిక్కబడేలా ఉడికిస్తారు. ఇలా గంజిని తయారుచేసి పంపిణీ చేస్తారు.ఈ గంజిలో బూందీ వేసుకుని ఇష్టంగా తింటారు. ఇంకా కొన్ని చోట్ల మసీదుల్లో ఈ గంజి తయారీకి ఖిమా కూడా వినియోగిస్తారట. ఉపవాసదీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ గంజిని కుల, మతాలకు అతీతంగా ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

రంజాన్‌ మాసంలో సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్‌ అని పిలువబడే ప్రార్థన, భోజనంతో వారంతా ఉపవాసం విరమిస్తారు. ఖర్జూరం, నీరు లేదంటే పాలతో ఉపవాసాన్ని విరమిస్తారు. ఖర్జూరం, నీరు తీసుకున్నాక భోజనం చేస్తారు. రంజాన్‌ మాసమంతా ఉపవాసం తరువాత చివరి రోజున ఈద్‌ఉల్‌ఫితర్‌, రంజాన్‌ పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.తమ శక్తిమేరకు దానాలు చేస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..