Honey Side Effects: తేనె దివ్యౌషధమే..! ఇలా వాడితే విషంతో సమానమట..? తస్మాత్‌ జాగ్రత్త..

బరువు తగ్గడానికి చాలా మంది తేనెపై ఆధారపడుతుంటారు.చక్కెర తినడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే తీపి కోసం చాలా రకాలుగా తేనెను వినియోగిస్తుంటారు.అయితే తేనె ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత మందికి తెలుసు.?నమ్మడం కష్టమే కానీ, ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Honey Side Effects: తేనె దివ్యౌషధమే..! ఇలా వాడితే విషంతో సమానమట..? తస్మాత్‌ జాగ్రత్త..
Honey
Follow us

|

Updated on: Apr 07, 2024 | 7:01 AM

Honey Side Effects: తేనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు.. కానీ, దాని ప్రతికూల అంశాల గురించి చాలా మందికి తెలియదు.తేనెలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి అవసరమైన అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.అందువల్ల శరీరంలోని అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో తేనె ఎంతో మేలు చేస్తుంది. అందుకే తేనెను అమృతంలా భావిస్తారు.ఆయుర్వేదం అనేక విధాలుగా తేనెను ఉపయోగిస్తారు.తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను శరీరం నుండి దూరంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి చాలా మంది తేనెపై ఆధారపడుతుంటారు.చక్కెర తినడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే తీపి కోసం చాలా రకాలుగా తేనెను వినియోగిస్తుంటారు.అయితే తేనె ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత మందికి తెలుసు.?నమ్మడం కష్టమే కానీ, ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. తేనెలో చక్కెర, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున మీ రోజువారీ ఆహారంలో ఎక్కువ తేనెను తీసుకోవడం వల్ల మీ బరువు వేగంగా పెరుగుతుంది. దానివల్ల శరీరంలో క్యాలరీలు వేగంగా పెరుగుతాయి.కాబట్టి మోతాదుకు మించి తేనెను తీసుకోవడం వల్ల బరువు పెరిగే చాన్స్ ఉందని అధ్యయనాలు తేల్చాయి.

2. తేనె ప్రభావం వేడిని కలిగిస్తుంది..కాబట్టి మీరు మీ ఆహారం, పానీయాలలో చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగిస్తే, అది మీ జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి.ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. కడుపు నొప్పిని కలిగిస్తుంది.తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో మంట సమస్య కూడా పెరిగే చాన్స్ ఉందట. మెల్లమెల్లగా జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

3. తేనె ఎక్కువగా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.దీంతో మధుమేహం బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని ఆహార పానీయాలలో తేనెను ఉపయోగించవద్దు.మధుమేహ వ్యాధిగ్రస్తులకు తేనె చాలా హానికరం.తేనె అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇది ఇన్సులిన్‌ను కూడా తగ్గించదు.రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నవారు తేనెను తీసుకోకపోవడమే ఉత్తమం.

4. తేనె ఎక్కువగా తీసుకోవడం వల్ల మీలో హైపర్ టెన్షన్ సమస్య వస్తుంది.ఇది మీకు అలెర్జీ సమస్యలను కూడా కలిగిస్తుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు కావచ్చు.

5. తేనె మీ దంతాలకు కూడా హానికరం. తేనె తాగేప్పుడు అది మన దంతాలలో అంటుకుంటుంది.దీనివల్ల ఆ ప్రాంతంలో పళ్ల చుట్టూ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ళకు హాని చేస్తుంది. క్రమంగా దంతాలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే, ఎక్కువ వేడి నీటిలో తేనె ఎప్పుడు తాగకూడదు. గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలే గానీ అలా అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
వేసవిలో సాయంత్రం ఈ స్నాక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం పదిలం..
వేసవిలో సాయంత్రం ఈ స్నాక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం పదిలం..
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??
టూర్ వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులుంటే బోలెడంత ఆదా..
టూర్ వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులుంటే బోలెడంత ఆదా..
ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి KKR.. SRH షాక్ ఇచ్చేనా?
ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి KKR.. SRH షాక్ ఇచ్చేనా?
పడుకుని ఫోన్ చూస్తున్నారా.. జరిగేది ఇదే! కావాలంటే చెక్ చేసుకోండి
పడుకుని ఫోన్ చూస్తున్నారా.. జరిగేది ఇదే! కావాలంటే చెక్ చేసుకోండి
టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..
టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..
కూర్మ జయంతి రోజున విష్ణు పూజ శుభ సమయం, పూజా విధానం మీ కోసం
కూర్మ జయంతి రోజున విష్ణు పూజ శుభ సమయం, పూజా విధానం మీ కోసం