Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ఉపయోగాలున్నాయా?

డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు తెలియని వారెవరూ లేరు. ఇంతకు ముందు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కేవలం విదేశాల్లో మాత్రమే లభ్యమయ్యేవి. రాను రానూ ఇది బాగా పాపులర్ అవ్వడంతో.. ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా దీన్ని సాగు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ని విరివిగా పండిస్తున్నారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఏది తిన్నా పోషకాలు మాత్రం ఒకటే. ఈ ఫ్రూట్‌లో విటమిన్లు ఇ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్..

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ఉపయోగాలున్నాయా?
Dragon Fruit
Follow us
Chinni Enni

|

Updated on: Apr 06, 2024 | 5:24 PM

డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు తెలియని వారెవరూ లేరు. ఇంతకు ముందు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కేవలం విదేశాల్లో మాత్రమే లభ్యమయ్యేవి. రాను రానూ ఇది బాగా పాపులర్ అవ్వడంతో.. ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా దీన్ని సాగు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్‌ని విరివిగా పండిస్తున్నారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఏది తిన్నా పోషకాలు మాత్రం ఒకటే. ఈ ఫ్రూట్‌లో విటమిన్లు ఇ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, కేలరీలు అన్ని పోషకాలు లభిస్తాయి. మరి ఈ పండు తినడం వల్ల శరీరానికి ఎంత మంచి చేస్తుంది? ఎన్ని రకాల ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్ ఉన్నవారికి బెస్ట్:

షుగర్ ఉన్నవాళ్లు ఏం తినాలన్నా చాలా భయపడి పోతారు. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని మాత్రం ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు. ఇందులో ఉండే ఫైబర్.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు తింటే షుగర్ లెవల్స్ అనేవి అస్సలు పెరగవు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఇది తింటే చాలా బెస్ట్.

క్యాన్సర్ – అల్జీమర్స్ దరికి చేరవు:

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు దరి చేరకుండా డ్రాగన్ ఫ్రూట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మెండుగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా లభ్యమవుతాయి. కాబట్టి చేపలు తినలేని వారు ఈ ఫ్రూట్ తింటే.. చాలు. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది.. శరీరంలోని అన్ని భాగాలకు చాలా మంచి చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది:

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చర్మ సౌందర్యం అనేది పెరుగుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మ కాంతిని పెంచుతుంది. దీంతో ముఖం అందంగా కనిపిస్తుంది.

కంటి – ఎముకల ఆరోగ్యానికి మంచిది:

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇందులో 18 శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఈ పండు తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి ఆరోగ్యానికి కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిది. కంటి రెటీనా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!