Fennel Water: వేసవిలో సోంపు వాటర్ తాగుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

వేసవిలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, డయేరియా, టైఫాయిడ్ వంటి సమస్యలు చాలా సాధారణం, కానీ అవి శరీరంపై చాలా తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి పరిస్థితిలో, నిపుణులు వేసవిలో బయటికి వెళ్లే ముందు శరీరాన్ని సరిగ్గా కప్పి ఉంచడం, సన్‌స్క్రీన్ అప్లై చేయడం, తగినంత నీరు త్రాగటం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు, మీరు శరీరం చల్లగా ఉండటానికి చల్లని నీరు తాగితే, అది అస్సలు మంచికాదు.. ఎందుకంటే వేడి కారణంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

|

Updated on: Apr 05, 2024 | 1:55 PM

వేసవిలో ఎండవేడిమి, డిహైడ్రేషన్‌ నుండి ఉపశమనం కోసం నిమ్మరసం, షికంజి, షర్బత్, సత్తు, చెరకు రసం వంటివి తీసుకోవడం ఉత్తమం.. ఇది శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటు వేసవిలో ఉపశమనాన్ని అందించే సోంపు వాటర్‌ తాగడం కూడా శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపు వాటర్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1 / 5
సోంపు వాటర్‌తో శరీరం చల్లగా ఉంటుంది. ఇది కూలింగ్ ఎఫెక్ట్‌ని కలిగి ఉంటుంది. సోంపు వాటర్‌ తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. సోంపు వాటర్‌ లో
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అనేక రకాల విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరం అనేక విధులకు అవసరం.

సోంపు వాటర్‌తో శరీరం చల్లగా ఉంటుంది. ఇది కూలింగ్ ఎఫెక్ట్‌ని కలిగి ఉంటుంది. సోంపు వాటర్‌ తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. సోంపు వాటర్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అనేక రకాల విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరం అనేక విధులకు అవసరం.

2 / 5
సోంపు జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంతో ఆహారంలోని పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. సోంపులో జింక్, ఫాస్పరస్, సెలీనియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి, ప్రతి రోజు వీటిని నమిలి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3 / 5
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు ఈ సోంపు వాటర్‌ తీసుకోవచ్చు. శరీర బరువును నియంత్రించేందుకు ఫైబర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు సోంపును తాగడం వల్ల శరీర బరువుకు కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

4 / 5
సోంపు వాటర్ బరువు తగ్గించడంతో పాటు, శరీర వేడిని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. కడుపును నిండుగా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని వేగంగా అందించటంలో సహాయపడుతుంది.
మీరు కూడా వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే, తప్పకుండా ఈ షర్బత్ తాగండి.

సోంపు వాటర్ బరువు తగ్గించడంతో పాటు, శరీర వేడిని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. కడుపును నిండుగా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని వేగంగా అందించటంలో సహాయపడుతుంది. మీరు కూడా వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే, తప్పకుండా ఈ షర్బత్ తాగండి.

5 / 5
Follow us
Latest Articles