AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketer Shivam Dubey: ప్రేమించి.. పెద్దలను ఒప్పంచి.. ఆదర్శ వివాహం.. వావ్ అనేలా క్రికెటర్ లవ్ స్టోరీ..

క్రికెట్ కు ప్రేమకు విడదీయలేని సంబంధం ఉంది. ఒకదానితో ఒకటి కలిసే ముందుకు వెళతాయి. ప్రఖ్యాత క్రికెటర్ల ఎందరో సినీ హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకు కులం, మతం, డబ్బు, హోదా అవసరం లేదని చాటి చెప్పారు. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారి జాబితా చేస్తే చాలా మంది లిస్ట్ ఉంటారు. అలాంటి ఓ లవ్ స్టోరీని మీకు పరిచయం చేస్తున్నాం. అది చైన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే. ఇతను కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ లవ్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Madhu
|

Updated on: Apr 05, 2024 | 3:56 PM

Share
శివమ్ దూబే ప్రేమకథ.. యువ క్రికెటర్ శివమ్ దూబే గురించి దేశంలో తెలియని క్రికెట్ అభిమానులు ఉండదు. ఐపీఎల్ తోపాటు అంతర్జాతీయ పోటీలలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. అతడికి కూడా ప్రేమ వివాహమే. పైగా మతాంతర వివాహం. అంజుమ్ ఖాన్ అనే నటి, మోడల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడి ప్రేమ, పెళ్లి ఘటనలు తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
కీలక ఆటగాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) బలమైన జట్టు. ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఈ జట్టు అనేక సార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది. ధోనీ కారణంగా సీఎస్ కే జట్టుకు అభిమానులు చాలా ఎక్కువ. దేశంలో ఎక్కడకు వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలుకుతారు. ఈ జట్టులో ప్రముఖ ఆటగాడు శివమ్ దూబే. తన హిట్టింగ్ తో సునాయాసంగా సిక్స్ లు కొట్టడం ఇతడి ప్రత్యేకత. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడి అనేకసార్లు విజయతీరాలకు చేర్చాడు. కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.

2 / 5
ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి.. శివమ్ దూబే తన ప్రేయసి అంజుమ్ ఖాన్ ను 2021 జూలైలో వివాహం చేసుకున్నాడు. హిందూ, ముస్లిం సంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుక జరిగింది. దేశంలో మత సామరస్యానికి వీరి పెళ్లి నిదర్శనంగా నిలిచింది. పెళ్లికి ముందు శివమ్, అంజుమ్ ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారు. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. అయితే వీరి పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వారిని ఒప్పించి శివమ్, అంజుమ్ ఒక్కటయ్యారు.

3 / 5
కుటుంబ సభ్యుల మద్దతు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజుమ్ ఖాన్ మోడల్, నటిగా పేరు పొందారు. హిందీ సీరియళ్ల తో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లలో నటించారు. ఈ జంట తమ వివాహాన్ని ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడ్డారు. మతాంతర వివాహం కారణంగా కొందరు లేనిపోని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వీరికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ఆ మద్దతుతో వీరిద్దరూ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు.

4 / 5
యువతకు ఆదర్శం.. శివమ్ దూబే, అంజుమ్ ఖాన్ అన్యోన్యంగా జీవిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శివమ్ దూబే ఇటీవల భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. రెండు సంచలన అర్ధసెంచరీలతో అద్భుతంగా ఆడి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కీలకంగా మారాడు.

5 / 5
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?

వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో

ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!

ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు

ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..

మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు